Mynampally Hanumanth Rao: తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై నెగిటివ్ ప్రభావం చూపించే ఘటనలపై పలువురు నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహాన్యూస్ కార్యాలయం పై జరిగిన దాడిని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు తీవ్రంగా ఖండించారు.
“ఇది రేపటి మీ ఇంటిపైనే దాడికి తెరలేపే ఉదాహరణ” అని ఆయన హెచ్చరించారు.
ఈ దాడి వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధమున్నట్లు ఆయన సంశయిస్తున్నారు. ‘‘బీఆర్ఎస్ ఇప్పటికీ అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉంది. వాళ్లకి కంట్రోల్ అంతా తమదేనన్న అహంకారమే ఈ పరిస్థితికి దారితీసింది’’ అని మైనంపల్లి విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ వల్ల బాధితుల జీవితం కల్లోలమే:
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడుతూ, ‘‘జడ్జిలు, రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ దురాగతంతో జడ్జిల కుటుంబాలను కూడా భయపెట్టారు’’ అని అన్నారు.
నా ఫ్యామిలీ, స్నేహితులు, గన్‌మెన్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఇది ఎంత తీవ్రమైన విషయమో ప్రతి ఒక్కరు గ్రహించాలి’’ అని మైనంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: MLC Kodandaram: ఆనాడు కేసీఆర్ చెప్పింది ఒక్కటి.. నాడు చేసింది ఒక్కటి
ప్రజాస్వామ్య దేశంలో ఇది అసహ్యకరమైన చర్య:
ఇది రాజ్యం కాదు, ప్రజాస్వామ్యం. ఈ విధంగా మీడియా సంస్థలపై దాడులు చేయడం, వ్యక్తిగత ఫోన్లు ట్యాప్ చేయడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి తగదు’’ అని మైనంపల్లి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఒక ఫ్యామిలీ పార్టీ మాత్రమే:
‘‘బీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీ. ఇష్టానుసారంగా పాలించారు. ఏవిధంగా దోచుకున్నారో పదేళ్లు ప్రజలు చూశారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారే సీఎం అన్న భ్రమలో ఉన్నారు’’ అని మైనంపల్లి ఎద్దేవా చేశారు.
‘‘ఈ దాడిని తక్కువగా చూసుకోవద్దు. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రేపు మన ఇళ్లపై దాడులు జరుగుతాయి’’ అని హెచ్చరించారు.
చివరగా సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి:
‘‘సీఎం గారూ… బీఆర్ఎస్ నాయకులను ఎంటర్‌టైన్ చేయవద్దు. ఈ దాడికి సంబంధించి ఉన్నవారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటి దాడి పునరావృతమైతే ఊరుకోము’’ అని మైనంపల్లి స్పష్టం చేశారు.

