BJP MP: ఒడిశాలోని బిజూ జనతా దళ్ (బీజేడీ) ఎంపీ సులతా డియోకు, మహీంద్రా గ్రూప్‌లో ఉద్యోగిగా ఉన్న సత్యబ్రత నాయక్ నుంచి హత్యాచార బెదిరింపులు వచ్చాయి. సత్యబ్రత నాయక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎంపీ సులతా డియోపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, “రేప్ చేసి హత్య చేస్తాను” అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బెదిరింపులు చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్త అని ఎంపీ సులతా డియో ఆరోపించారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు సరైన చర్యలు తీసుకోలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విషయంపై మహీంద్రా గ్రూప్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ఉద్యోగుల నుంచి ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, తమకు “జీరో టాలరెన్స్” విధానం ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించామని, నిబంధనల ప్రకారం సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు ఎంపీ సులతా డియోకు మద్దతుగా నిలిచారు. ఈ ఘటన ప్రస్తుతం పెద్ద కలకలం రేపింది, దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఎంపీ సులతా డియో బీజేడీ పార్టీలో క్రియాశీలక సభ్యురాలు.
ఇది కూడా చదవండి: Surat: సూరత్ డైమండ్ కంపెనీలో భారీ చోరీ.. ఆలస్యంగా గుర్తింపు
2022లో ఆమె రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు, ఆమె ఒడిశా ప్రభుత్వంలోని మిషన్ శక్తి కార్యక్రమానికి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆమె 1992లో ఉత్కల్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ డిగ్రీ పొందారు. సులతా డియో రాజ్యసభలో వివిధ అంశాలపై చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, మహిళలు పిల్లలపై హింస వంటి విషయాలపై గట్టిగా మాట్లాడతారు.
Official Statement pic.twitter.com/JBGa4pNl98
— Mahindra Group (@MahindraRise) August 18, 2025