Mahesh Kumar goud: తెలంగాణలో దొంగ ఓట్లు 

Mahesh Kumar goud: తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఆయన మాట్లాడుతూ, “దొంగ ఓట్ల సహాయంతోనే బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచారు. ఆ ఓట్లు లేకపోతే ఒక్కరైనా గెలిచే పరిస్థితి ఉండేది కాదు. బండి సంజయ్ కూడా విజయం సాధించేవాడు కాడు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా ఓటు చోరీపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, మహేశ్ గౌడ్ చేసిన ఈ ఆరోపణలు మరింత హాట్‌టాపిక్ అయ్యాయి. రాహుల్ గాంధీ కూడా ఇలాంటి ఆరోపణలతో బీజేపీపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రకారం, ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఓట్లను దోచుకుంటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, ఈ ఆరోపణలను బీజేపీ పూర్తిగా ఖండిస్తోంది. తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయన్న మహేశ్ గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *