Mahesh kumar goud: “మార్వాడీ గో బ్యాక్” వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టమైన స్పందన ఇచ్చారు. మార్వాడీలు మన దేశానికి చెందినవారని, వారంతా మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడుతూ, “రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలుసుకుంటాం. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది” అని తెలిపారు.
తనకు మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే పార్టీలో చేర్చుకున్నారని, తాను పార్టీలో చేరినప్పుడు ‘ఇద్దరం అన్నదమ్ములం ఉన్నాం కదా’ అని వ్యాఖ్యానించిన రాజగోపాల్ రెడ్డి మాటలు ఇప్పటికే చర్చనీయాంశమవుతున్నాయి. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పైన చెప్పిన విధంగా స్పందించారు.