Mahesh kumar goud: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు, బీఆర్ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని” మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రస్తావిస్తూ “పీఠంపై కూర్చోమంటూ మాయ మాటలు పలికారు” అని దుయ్యబట్టారు.
మహేశ్ గౌడ్.. హరీశ్ రావును ఉద్దేశించి “పెట్రోల్ డబ్బతో డ్రామాలు చేసి యువతను బలిదానాల వైపు నడిపించారు” అని విమర్శించారు. “నోటిఫికేషన్ ఇచ్చినా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, అవకతవకలు, గందరగోళం చేసి నిరుద్యోగులతో అడుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి ఏడాదిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన అంశాన్ని ప్రస్తావించి, “పాలనలో ఉన్నప్పుడు అవినీతిమయమైన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసినమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశాలను సమర్థించేవారు, “మూసీ సుందరీకరణపై అసత్య ఆరోపణలు చేయడం తప్పు” అని తెలిపారు.