Mahesh-Boyapati: ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయాలనే కలను ఎప్పటి నుంచో కంటున్నాడు. మహేష్‌ను వైట్ డ్రెస్‌లో, ఫ్యాక్షన్ రక్తపాతంతో కూడిన మాస్ హీరోగా చూపించాలని బోయపాటి ఉవ్విళ్లూరుతున్నాడు. అఖండ 2తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతూనే, మహేష్‌తో సినిమా కోసం కథలు రాస్తున్నాడు. ఈ కాంబో ఊహిస్తేనే ఫ్యాన్స్‌లో జోష్ పీక్స్‌లో ఉంది. మహేష్‌ను బోయపాటి స్టైల్‌లో చూస్తే రచ్చ రంబోలా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ ట్విస్ట్ ఏంటంటే, మహేష్ ఇప్పుడు రాజమౌళితో భారీ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో బిజీ. 3 ఏళ్లు ఈ సినిమాకే కేటాయించాడు. ఆ తర్వాత బోయపాటితో జత కడతాడా? అనేది సస్పెన్స్. బోయపాటి మాత్రం “మహేష్‌తో సినిమా నా లైఫ్ గోల్” అంటూ గట్టిగా చెబుతున్నాడు. మహేష్‌ను ఎగ్జైట్ చేసే పాన్ ఇండియా కథ రాస్తే, ఈ కల సాకారం కావచ్చు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.
