Namrata Shirodkar

Namrata Shirodkar: ‘ముఫాసా’ అలరిస్తుందంటున్న నమ్రతా!

Namrata Shirodkar: ఐదేళ్ళ క్రితం వచ్చిన ‘ది లయన్ కింగ్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో దాని మేకర్స్ ఇప్పుడు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ మూవీని తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. ఈ తాజా చిత్రం భారత్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వస్తోంది. బారీ జెంక్లిన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు వర్షన్ లో ముఫాసా కు మహేశ్ బాబు వాయిస్ ఇచ్చారు. ఇటీవల జరిగిన మీడియా మీట్ లో నమ్రత మాట్లాడుతూ, ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పేప్పుడు మహేశ్ బాబు ఎంతో ఎంజాయ్ చేశారని అన్నారు. మహేశ్ వాయిస్ తో విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించడం పట్ల నమ్రతా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను నమ్రత ఆవిష్కరించారు. ఈ సినిమాలో టాకా పాత్రకు వాయిస్ ఇచ్చిన సత్యదేవ్, టిమోన్ పాత్రకు గొంతు అరువిచ్చిన అలీ కూడా పాల్గొన్నారు. ఇందులోని పుంబాకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ ఇవ్వడం విశేషం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Manohar Chimmani: మనోహర్ చిమ్మని దర్శకత్వంలో YO! 10 ప్రేమకథలు సినిమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *