Mahesh Babu Son

Mahesh Babu Son: యాక్టింగ్‌తో అదరగొట్టిన సూపర్ స్టార్ తనయుడు!

Mahesh Babu Son: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే నటన పరంగా అడుగులు వేస్తున్న మహేష్ కుమారుడు గౌతమ్, తాజాగా ఓ వీడియోతో ఆకట్టుకుంటున్నాడు. న్యూయార్క్ కాలేజీలో, మైమ్ ప్రదర్శన చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మకమైన NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో తన యాక్టింగ్ తో అదరగొట్టాడు గౌతమ్. ఈ వీడియోలో.. ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లు కనిపించాడు. మొదట నవ్వుతూ, తర్వాత కోప్పడుతూ మాటలు లేకుండానే తన భావాలను అద్భుతంగా వ్యక్తం చేశాడు. ఎమోషన్స్‌ని బాగానే పలికించాడు గౌతమ్. ఇక ఈ వీడియోను సెరాఫీనా జేరోమి తెరకెక్కించగా.. కాశ్వీ రమణి, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Modi: నేడు జపాన్ పర్యటనకు మోదీ.. షెడ్యూల్ ఇదే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *