Mahesh Babu

Mahesh Babu: SSMB29 రిలీజ్ డేట్ ఫిక్స్?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మహేష్ కెరీర్‌లో 29వ సినిమాగా, గ్లోబల్ స్థాయిలో అంచనాలను మించేలా తెరకెక్కుతోంది.

స్టార్ నటీనటుల సమాహారంతో జక్కన్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై తాజాగా ఓ సంచలన అప్‌డేట్ వైరల్‌గా మారింది. 2027 మార్చ్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డేట్‌ను లక్ష్యంగా పెట్టుకొని ప్రస్తుతం చిత్రీకరణ, నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని టాక్.

Also Read: Oscar Awards: ఆస్కార్‌లో కొత్త స్టంట్ అవార్డ్.. కాలర్ ఎగరేస్తున్న చరణ్ ఫ్యాన్స్!

Mahesh Babu: అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజమౌళి గత చిత్రాల సక్సెస్, మహేష్ బాబు క్రేజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక అప్‌డేట్ కోసం వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *