Darshan: సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు దర్శన్ ప్రభాస్ చిన్నప్పటి రోల్‌లో నటిస్తున్నాడు. హను రాఘవపూడి ‘ఫౌజీ’లో జూనియర్ ప్రభాస్ గా నటిస్తున్నాడు సుధీర్ బాబు కుమారుడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, మహేశ్ బాబు బావ సుధీర్ బాబు కుమారుడు దర్శన్ నటనలో గుర్తింపు పొందుతున్నాడు. అన్న చరిత్ మానస్ భలే భలే మగాడివోయ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. దర్శన్ సర్కారు వారి పాట సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’లో నటిస్తున్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 1930 రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సినిమా రాబోతుంది. మైత్రి మూవీస్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇందులో దర్శన్.. ప్రభాస్ చిన్నప్పటి రోల్ పోషిస్తాడట. సుధీర్ బాబు జటాధరా ప్రమోషన్స్‌లో ఈ అప్‌డేట్ ప్రకటించాడు. తాత కృష్ణ, మేనమామ మహేశ్‌లా దర్శన్ పెద్ద హీరోగా నిలవడం ఖాయమని ఘట్టమనేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

