Mahesh Babu

Mahesh Babu: ఇక నుంచి మహేష్ పాన్ ఇండియా రాంప్!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు. టాలీవుడ్ స్టార్స్ భారీ చిత్రాలతో జాతీయ స్థాయిలో సందడి చేస్తుంటే, మహేష్ మాత్రం ఇప్పటి వరకు రీజనల్ సినిమాలతో రికార్డులు సృష్టించారు. కానీ ఇక నుంచి ఆయన ఇమేజ్‌కు తగ్గ బొమ్మలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశమంత ఎత్తుకు పెరిగింది. పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Amrita Rao: అమృతారావు షాకింగ్ గతం: పెళ్లి ప్రతిపాదనల భయానక అనుభవాలు!

టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు. పవన్ కూడా ఓజితో మరికొద్ది గంటల్లో పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. ఆయన కూడా రాజమౌళితో ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రంతో కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ లెక్కలు మాములుగా ఉండవని తెలుస్తుంది. ఇప్పటివరకు సోషల్ మెసేజ్, రీజనల్ కమర్షియల్ సినిమాలతో అలరించిన మహేష్, ఇక నుంచి కేవలం తన ఇమేజ్‌కు తగ్గ భారీ చిత్రాలతో మాత్రమే రాబోతున్నారు. తెలుగు సినిమాలతోనే జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించిన మహేష్, SSMB29 సినిమాతో కచ్చితంగా పాన్ వరల్డ్ హీరో అవ్వడం పక్కా. అందుకే రాజమౌళి తర్వాత సందీప్ వంగ, సుకుమార్ వంటి తెలుగు దర్శకులతోనే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్ బేస్ టాలీవుడ్‌లో అత్యధికం. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకులు కూడా మహేష్‌తో సినిమాలకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. కానీ మహేష్ మాత్రం తెలుగు దర్శకులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *