హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. వరద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించిన రూ.50 లక్షలు చెక్కును మహేశ్ దంపతులు సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఎఎంబి సినిమాస్ తరఫున కూడా మహేష్ మరో రూ.10 లక్షలు విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు ప్రకటించి సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విరాళాల చెక్కులను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కులు అందించారు. తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రాంచరణ్ తరఫున మరో రూ.50 లక్షల చెక్కులను సిఎం రేవంత్‌కు అందించారు. అలాగే, బాలకృష్ణ, విశ్వక్‌సేన్, సాయిధరమ్ తేజ్, అలీ తదితర టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ ను కలిసి తమ విరాళాల చెక్కులను అందించారు.

