Namrata Shirodkar: టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు జనవరి 22న జరిగింది. మహేశ్ ను వివాహం చేసుకోవడానికంటే ముందే నమ్రత పలు చిత్రాలలో కథానాయికగా నటించింది. ‘వంశీ’ సినిమాలో మహేశ్ తో కలిసి నటించడంతో ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. ఇదిలా ఉంటే… మహేశ్ బాబు చేసే సేవాకార్యక్రమాలను నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ కొన్ని గ్రామాలను మహేశ్ బాబు ఫౌండేషన్ తరఫున దత్తత్తు తీసుకుని అక్కడి ప్రజలకు సేవ చేస్తున్నారు. తాజాగా నమ్రత పుట్టిన రోజు సందర్భంగా బుర్రిపాలెంలోని 70మంది యువతులకు ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి మహేశ్ బాబు ఫౌండేషన్ హెచ్.పి. వాక్సిన్ తొలి డోస్ ను వేసింది. వీరందరికీ ఆరునెలల వ్యవథిలో రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వికల్ కాన్సర్ రాకుండా ఈ వాక్సిన్ కాపాడుతుంది. తాము దత్తతు తీసుకున్న బుర్రిపాలెంలో వైద్య పరంగానే కాకుండా విద్యాపరంగానూ అక్కడి వారికి ఎం.బి. ఫౌండేషన్ సేవలు అందిస్తోంది.
