Athadu: సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఐకానిక్ చిత్రం ‘అతడు’ ఆగస్టు 9న తన 20వ వార్షికోత్సవం సందర్భంగా 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ కానుంది. సూపర్‌స్టార్ 50వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, ఈ రీ-రిలీజ్‌కు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. జులై చివరి నుంచి వరుసగా పెద్ద సినిమాల రిలీజ్‌లు జరుగుతుండటంతో థియేటర్ యజమానులు స్క్రీన్‌ల కేటాయింపుపై ఆలోచనలో పడ్డారు.
Also Read: Spirit: ఇక నో బ్రేక్స్.. ఫారిన్లో స్పిరిట్ జోరు!
కొత్త సినిమాల హవా, థియేటర్ డ్యామేజ్ భయం వంటి అంశాలు వారిని సందిగ్ధంలో నిలిపాయి. అతడు రీ-రిలీజ్ భారీ రికార్డులను సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ, ఈ సవాళ్లను అధిగమించగలదా? ఫ్యాన్స్ ఉత్సాహం, రీ-రిలీజ్ ట్రెండ్‌తో పాటు, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపనుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది.