Mahavatar Narsimha OTT: ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ చిత్రం థియేటర్లలో దుమ్మురేపుతోంది. స్టార్ హీరోలు, భారీ ప్రమోషన్స్ లేకుండానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అద్భుతమైన టాక్‌తో జనాలను ఆకట్టుకుంది. దీంతో, ఓటిటి హక్కుల కోసం ప్రముఖ సంస్థలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. అయితే, మేకర్స్ ఉత్తమ ఆఫర్ కోసం వేచి చూస్తున్నారట. సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన 60 రోజుల తర్వాత ఓటిటిలోకి రానుందని సమాచారం.
