Mahavatar Narasimha: బాక్సాఫీస్ బరిలో ఉగ్రావతారం చూపిస్తోంది మైథలాజికల్ యానిమేషన్ మూవీ.. మహావతార్ – నరసింహ.. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చెయ్యగా.. తెలుగులో గీతా ఫిల్మ్స్ రిలీజ్ చేసిన ఈ మూవీకి పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల కనకవర్షం కురుస్తోంది. మూడో వారంలోకి ఎంటర్ అవుతూనే మరో రేర్ రికార్డ్ చేసింది..
Also Read: Hyderabad: సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల కీలక నిర్ణయాలు
మహావతార్ నరసింహ బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తోంది.. దేశంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన యానిమేటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసి.. ఆగస్టు 3, ఆదివారం నాటికి కేవలం ఇండియాలోనే అక్షరాలా నూట ఐదు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. థర్డ్ వీక్ లో ఫస్ట్ డే అయిన ఆగస్టు 8 తో ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.. సెకండ్ పార్ట్ మహావతార్ : పరశురామ్ 2027లో రిలీజ్ కానుంది.