Maharastra: రోడ్డుపై వాహనాల ట్రాఫిక్ చిక్కులే కాదు.. ఇబ్బడి ముబ్బడిగా రోడ్లపై పార్కింగ్ చేసే వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ వాహనాల రద్దీని అరికట్టడానికీ మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకురావాలని నిర్ణయించింది. అసలు పార్కింగ్ స్థలం ఉన్నట్టు ఆధారాలు ఇస్తేనే కార్లు అమ్మాలనే నిబంధనను ఆ ప్రభుత్వం ముందుకు తెచ్చింది.
Maharastra:ఇకపై ఎవరైనా కారు అమ్మాలంటే ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తేల్చిచెప్పారు. కార్లు కొనేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని, త్వరలో ఈ నిబంధన అమలులోకి వస్తుందని చెప్పారు.
Maharastra:ఈ ప్రతిపాదనలపై ప్రజల నుంచి కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదని హితవు పలికారు. అయితే దానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలను కొనుగోలు చేసుకోవాలని మంత్రి ప్రతాప్ సర్నాయక్ సూచించారు.

