Maharastra: మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్‌పై లైంగికదాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ గోపాల్ బదానే తాజాగా అరెస్టయ్యాడు. అక్కడి ఫల్టన్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వచ్చిన నిందితుడు పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయాడని ఎస్పీ తుషార్ దోషి వెల్లడించారు. ఎస్ఐ గోపాల్ తనపై మూడుసార్లు లైంగికదాడి చేశారంటూ ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్ చేతిపై సూసైడ్ నోట్ రాసి ఉన్నది.
Maharastra: ఇదే కేసులో మరో నిందితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ బాంకర్‌ను కూడా ఫల్టన్ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న బాధితురాలు గత గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మహిళా డాక్టర్ మరో ఆరోపణ చేశారు. మెడికల్ రిపోర్టు తప్పుడుగా ఇవ్వాలంటూ ఓ ఎంపీ తనపై ఒత్తిడి తెచ్చారని కూడా ఆరోపణలు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు.

