Maharashtra Elections

Maharastra Elections: మహారాష్ట్రలో ఎన్నికల ముందు కలకలం

Maharastra Elections: మహారాష్ట్రలో ఓటింగ్‌కు ముందు జరిగిన నగదు కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. హోటల్‌ వివంత్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే డబ్బు పంపిణీ చేశారని బహుజన వికాస్ అఘాడి ఆరోపించింది. విరార్ ఈస్ట్‌లోని వివాంట్ హోటల్‌లో తావ్డే డబ్బును పంచాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణల ప్రకారం తావ్డే, అసెంబ్లీ స్థానం అభ్యర్థి రాజన్ నాయక్ పంపిణీ చేసేందుకు రూ.5 కోట్లు తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఒకటి తావ్డేపై, రెండవది బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్  అలాగే మూడవది బహుజన వికాస్ అఘాడీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.  ఈ విషయంలో వినోద్ తావ్డే వివరణ ఇచ్చారు. 

Maharastra Elections: హోటల్ లో నలసోపరా ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసినట్టు  తావ్డే చెప్పారు. ఓటింగ్ రోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఓటింగ్ మెషీన్‌కు ఎలా సీలు వేయాలి, అభ్యంతరం వస్తే ఏం చేయాలి అనే విషయాల గురించి వారికి సమాచారం ఇవ్వడానికి తాను వచ్చినట్టు తెలిపారు. బహుజన వికాస్ అఘాడీ కార్మికులు అప్పా ఠాకూర్, క్షితీజ్‌లు డబ్బులు పంచుతున్నామని ఆరోపణలు చేశారు.  కానీ, అది నిజం కాదని స్పష్టం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం, పోలీసులు విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

Maharastra Elections: తావ్డే ప్రకటనకు ముందు ఎన్నికల సంఘం బృందం హోటల్‌లో సోదాలు చేసింది. ఈ క్రమంలో రూ.9 లక్షల 93 వేల 500 దొరికాయి. దీంతోపాటు కొన్ని డాక్యుమెంట్లు కూడా దొరికాయి. వినోద్ తావ్డే ఈ డబ్బు తెచ్చాడా లేదా అది బీజేపీకి చెందినదా… అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై ఎన్నికల సంఘం, కలెక్టర్‌తో విచారణ జరుపుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: మరాఠా గడ్డపై సేనాని మాస్ స్పీచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *