Viral News

Viral News: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. అడ్డంగా దొరికిపోయాడు.. వీడియో వైరల్!

Viral News: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావు కోకాటే తన మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా, కోకాటే తన మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ కార్డ్ గేమ్ (రమ్మీ) ఆడుతున్నట్లుగా ఒక వీడియోలో కనిపించారు. ఈ వీడియోను ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ X లో పోస్ట్ చేసి, మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలో రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, నిత్యం ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అలాంటి సమయంలో వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో రమ్మీ ఆడటం సిగ్గుచేటని రోహిత్ పవార్ ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలపై మంత్రి మాణిక్ రావు కోకాటే స్పందించారు.

ఇది కూడా చదవండి: Harbhajan Singh: శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టడంపై హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ !

తాను రమ్మీ ఆడలేదని, అది సాలిటైర్ గేమ్ అని, తన ఫోన్‌లో ఎవరో డౌన్‌లోడ్ చేసి ఉంటారని చెప్పారు. అసెంబ్లీలో దిగువ సభలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి తాను యూట్యూబ్ తెరిచానని, ఆ సమయంలో గేమ్ యాడ్ వచ్చిందని, దాన్ని స్కిప్ చేయడానికి ప్రయత్నించానని వివరణ ఇచ్చారు. అయితే, రోహిత్ పవార్ పూర్తి వీడియోను కాకుండా కేవలం చిన్న క్లిప్‌ను మాత్రమే వైరల్ చేశారని, ఇది తన ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమని మంత్రి ఆరోపించారు.

కాంగ్రెస్, శివసేన (యూబీటీ) వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డాయి. రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి అసెంబ్లీలో ఆటలు ఆడటం ప్రజాస్వామ్యానికి అవమానకరమని, వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది మరియు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *