Maharashtra: మహారాష్ట్ర మహాయుతి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వారం తర్వాత మంత్రిత్వ శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు కీలక శాఖల కేటాయింపులు జరిగాయి. ముఖ్యమంత్రి పదవి కోసం చివరిదాకా పోరాడి, డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్న ఏక్‌నాథ్ షిండేకు కోరుకున్న హోంశాఖ శాఖ దక్కకపోగా ప్రాధాన్యం లేని శాఖలే దక్కాయి. ఏది ఏమైనా వివిధ సమీకరణల దృష్ట్యా మంత్రిత్వ శాఖల కేటాయింపు మాత్రం ఓ కొలిక్కి వచ్చింది.
Maharashtra:మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్‌కు హోం, విద్యుత్తు, న్యాయ శాఖలు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖలు, మరో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖలు కేటాయించారు. మంత్రులు చంద్రశేఖర్ ప్రభావతికి రెవెన్యూ, రాధాకృష్ణ వికే పాటిల్‌కు జల వనరులు, హసన్ ముష్రిఫ్‌కు విద్యాశాఖ, జయకుమార్ గోరేకు గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు.
Maharashtra:సంజయ్ శిర్సత్‌కు సామాజిక న్యాయశాఖ, ధనుంజయ్ రుక్మిణి ముండేకు ఆహార, పౌరసరఫరాల శాఖ, అశోక్ ఉయ్‌కేకు గిరిజనాభివృద్ధి శాఖ, ఆశిష్ మీనాల్‌కు ఐటీ, సాంస్కృతిక శాఖ, ఉదయ్ సమంత్‌కు పరిశ్రమల శాఖ, పంకజ్ ముండేకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, మాణిక్‌రావు కొకాటేకు వ్యవసాయ శాఖలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేటాయించారు.

