Maharashtra Assembly Session: డిసెంబర్ 7 నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ వ్యవహరించనున్నారు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలంబ్కర్‌తో మధ్యాహ్నం ఒంటిగంటకు రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ అయిన తర్వాత కొలంబ్కర్ కొత్తగా ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. అలాగే డిసెంబర్ 9న 15వ అసెంబ్లీకి స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షను నెగ్గుతుంది.
ఇది కూడా చదవండి: Delhi: రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం..
అంతకుముందు డిసెంబరు 5న దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఏక్నాథ్ షిండే-అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 13వ రోజు అంటే నవంబర్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా తర్జనభర్జనల తర్వాత డిప్యూటీ సీఎం పదవిని అంగీకరించిన షిండే, సీఎం నుంచి డిప్యూటీ సీఎం అయిన మహారాష్ట్ర రెండో నాయకుడుగా నిలిచారు.
ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆరోసారి డిప్యూటీ సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే మంత్రులు ప్రమాణస్వీకారం చేసి వారి శాఖలను అందజేస్తామని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయిస్తారు. మా పాత్రలు మారాయి, మా దిశ మారలేదు. మంత్రివర్గం ఖరారు అయింది. ఇందులో పెద్దగా మార్పులు ఉండవు అని అజిత్ పవర్ స్పష్టం చేశారు.