Mahammad Shami:భారత స్టార్ క్రికెటర్, పేసర్ మహ్మద్ షమీ, తన భార్య విడాకుల కేసు విషయంలో కోల్‌కతా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. షమీ భార్యతో పాటు ఆమె కూతురు సంరక్షణ కోసం భరణం కింద చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించింది. ఇప్పటికే వారిద్దరూ వేరుగా ఉంటుండగా, భరణం చెల్లించే విషయంపై ఇప్పటివరకూ కోర్టు విచారణ జరుగుతున్నది.
Mahammad Shami:భార్య, కూతురు సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలు భరణం చెల్లించాలని షమీని కోల్‌కతా కోర్టు ఆదేశించింది. ఆ మొత్తంలో షమీ మాజీ భార్య హసీన్ జహాన్ కోసం నెలకు రూ.1.5 లక్షలు, కుమార్తె కోసం నెలకు రూ.2.5 లక్షల చొప్పున షమీ ఇవ్వాలని ఆదేశించింది. అయితే షమీ స్థాయికి చాలా తక్కువని, తాము రూ.10 లక్షల వరకు భరణం చెల్లించాలని కోరామని షమీ మాజీ భార్య హసీన్ జహాన్ పేర్కొనడం గమనార్హం.
Mahammad Shami:షమీ, హసీన్ జహాన్ దంపతులు 2018లో విడాకులు తీసుకున్నారు. అయితే ఏడేళ్ల కిందతే షమీ నుంచి తాము నెలకు రూ.10 లక్షల వరకు భరణం ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశామని, అప్పటి నుంచి అతడి ఆదాయం, ఖర్చులు కూడా పెరిగాయని హసీన్ జహాన్ పేర్కొన్నారు. షమీ ఎలా తన జీవితాన్ని గడుపుతున్నాడో, తాను, తన కూతురు అదే స్థాయి జీవితాన్ని కొనసాగించే హక్కు తమకు ఉన్న దని ఆమె తేల్చి చెప్తున్నారు.