Mahalakshmi Scheme:తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకం అమలు అప్పుడేనా? దాని అమలుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నదా? ఈ పథకం అమలు చేయకుంటే అధికార పార్టీకి ఓట్లకు గండిపడక తప్పదా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థికసాయం చేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపిందని భావిస్తున్నారు.
Mahalakshmi Scheme:కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో, ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఆ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఈ పథకం బాగా ఆకట్టుకున్నది. అందుకే పెద్ద ఎత్తున ఓట్లకు దారితీసి, కాంగ్రెస్ విజయానికి తోడ్పడింది.
Mahalakshmi Scheme:అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి కింద రూ.2,500 పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ పక్కన పెట్టింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. అయినా మహిళలు అంత సంతృప్తిగా లేరనే తెలుస్తున్నది. నెలకు రూ.2,500 ఎప్పుడిస్తారనే ఆశతోనే ఉన్నారు. ఇదే దశలో కొన్ని అంశాల్లో ప్రభుత్వంపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది.
Mahalakshmi Scheme:ఇదే సమయంలో స్థానిక ఎన్నికల గడువు ముంచుకొస్తున్నది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకే ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో ఓట్లను క్యాష్ చేసుకునేందుకు ఏం చేయాలనే సమాలోచనలో భాగంగా, మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ అగ్రనేతల్లో మెదిలింది. అందుకే ఈ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.
Mahalakshmi Scheme:ఈ పథకం కింద 18 ఏళ్ల వయసు నిండి 55 ఏళ్ల లోపు ఉండి, పింఛన్ పొందని తెల్లరేషన్ కార్డు కలిగిన మహిళలకు ఆర్థికసాయం అందనున్నది. అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30,000 అందుతాయి. స్థానిక ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేసి ఓటర్లలో విశ్వాసాన్ని పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నదని తెలుస్తున్నది.