Mahaa Vamsi Donates 1 lakh

Mahaa Vamsi Donates 1 lakh: 106 ఏళ్ల చరిత్ర MCPS కొండయ్యపాలెం.. లైవ్ లో మహా వంశీ లక్ష విరాళం

Mahaa Vamsi Donates 1 lakh: నెల్లూరులోని ఓ ధనవంతులు ఉండే ప్రాంతంలో, 1919లో స్థాపించబడిన కేఎన్‌ఆర్ మునిసిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఇప్పుడు మార్పు మాదిరిగా నిలుస్తోంది. ఊహించని సంగతి ఏంటంటే… ఈ స్కూల్‌ లో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్కువగా రోజువారీ కూలీల పిల్లలు, పనికి వెళ్తే గని పుట గడవని పిల్లలే. బయట నుంచి చూస్తే ఇది గోపవలు చదువుకుంటున్న స్కూల్‌లా కనిపిస్తుంది కానీ లోపల చదువుతున్న పిల్లలు మాత్రం ఎంతో పేద పిల్లలు వాళ్ళు మాత్రం జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో ఉంది చదువుకుంటున్నారు. 

మార్పు రథసారథి భాస్కర్ రావు

ఈ స్కూల్ పునర్జన్మకు కారణం హెడ్‌మాస్టర్ భాస్కర్ రావు గారు. శారీరకంగా వైకల్యం ఉన్నా, అతని సంకల్పం మాత్రం ఎవరూ తాకలేని విధంగా గట్టిగా ఉంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఈయన, స్కూల్ అభివృద్ధికి తన జీవితాన్నే అంకితం చేశారు.

విరాళాల కోసం తాను స్వయంగా ప్రయత్నించారు. ఇంటింటికీ వెళ్లి పిల్లలకు అడ్మిషన్లు తీసుకొచ్చారు. ఎప్పుడో పాడుబడినట్టుగా కనిపించిన స్కూల్, ఇప్పుడు విద్యాబోధనకు అద్భుత మోడల్‌గా మారింది..

లోకేష్ నడిపిన విద్యా మార్పు వాహిని

ఇప్పుడే రాష్ట్రంలో విద్యావ్యవస్థలో కొత్త గాలులు ఊరిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఉపాధ్యాయుల ఒత్తిడిని తగ్గించాయి. “తల్లికి వందనం” కార్యక్రమం ద్వారా తల్లులకు నేరుగా విద్యా సహాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా మందిలో నమ్మకాన్ని నింపింది.

చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులు

ఈ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. చారిణి, హిమవర్షిణి లాంటి విద్యార్థినులు “షైనింగ్‌ స్టార్స్” అవార్డు అందుకున్నారు. ఈ అవార్డులు మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా అందుకోవడం వారు గర్వంగా భావిస్తున్నారు.
వారు గర్వంగా చెబుతున్నారు.. “ప్రభుత్వ స్కూల్‌లో చదవడం గొప్ప అనుభవం. ఇక్కడ మంచి పునాదులు ఏర్పడ్డాయి.”

ప్రజల భాగస్వామ్యమే నిజమైన మార్పు

హెడ్‌మాస్టర్ భాస్కర్ రావు గారు స్పష్టం చేసిన మాటలు మనం ఎప్పటికీ మర్చిపోలేము…
“ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజలు కూడా ముందుకు రావాలి. అందరి సహకారంతోనే స్కూల్‌ అభివృద్ధి సాధ్యం.”

మహా న్యూస్‌ హృదయానికి హత్తుకునే విరాళం

మహా న్యూస్‌ ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ & చైర్మన్ వంశీ కృష్ణ మరెళ్ల గారు స్కూల్ అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఇది అక్కడి పిల్లలకు, టీచర్లకు ఎంతో ఆనందాన్ని తెచ్చింది. అందరూ అతనికి ధన్యవాదాలు తెలిపారు.

మన భవిష్యత్‌ కోసం.. మన బాధ్యత

ఈ కథనం ముగింపు ఇదే.. ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి మనందరి బాధ్యత. డబ్బు కాదు.. చిన్న సహాయం కూడా చాలు.
మన పిల్లల భవిష్యత్తు మెరుగుపరచడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుదాం.
“ఇది మన బాధ్యత.. మన భవిష్యత్‌ కోసం!”

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *