mahaa vamsi

Mahaa Vamsi: మహా విజయం.. డీ గ్యాంగ్ గుట్టు రట్టు

Mahaa Vamsi: రైస్ మాఫియా.. కొన్ని నెలలుగా మహా న్యూస్ వరుసగా దీనిపై కథనాలు ఇస్తూ వచ్చింది. కాకినాడ పోర్ట్ కేంద్రంగా పెద్ద ఎత్తున రైస్ మాఫియా రెచ్చిపోతోందంటూ చెబుతూ వచ్చింది. పోర్టును తమ ప్రయివేట్ అడ్డాగా చేసుకుని ద్వారంపూడి బ్రదర్స్ అండ్ కో ఇక్కడ డీ గ్యాంగ్ గా అవతరించారు. ముంబాయిలో దావూద్ కి చెందిన డి గ్యాంగ్ ఎలా అయితే వ్యవహరిస్తూ వస్తోందో.. అంతకు మించి కాకినాడలో ఈ డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ ద్వారంపూడి బ్యాచ్ చేస్తున్న అక్రమాలు. 

బియ్యం రవాణా కోసం పోర్టుకు వచ్చే ప్రతి లారీని తమ కనుసన్నల్లోనే ఉంచుకుని.. తమకు కప్పం కడితేనే.. గోడౌన్ లో సరుకు దిగాలి.. తమను సంతృప్తి పరిస్తేనే బియ్యం షిప్ ఎక్కాలి.. ఇదే  వరుస. మహా న్యూస్ ఈ వరుసను చేధించింది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు అధికారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పేదల తరఫున మహా న్యూస్ చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. 

తీగలాగితే డొంక కదిలినట్టు.. ఏదో పీడీఎస్ రైస్ ను దొంగతనంగా తరలిస్తున్నారు అనే విషయంపై వచ్చిన ఆరోపణలు.. చివరికి కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న అనేక అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఇక్కడ జరిగే దందా గురించి సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే.. పీడీఎస్ రైస్ పాలిష్ పట్టి.. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేసి రూపాయి బియ్యాన్ని వందరూపాయలు పైగా ఆఫ్రికా దేశాల్లో అమ్ముకుంటున్నారు. ఇది ఒక్కటే కాదు. 

ఇది కూడా చదవండి: Mahaa Vamsi: మహా వంశీ కి బెదిరింపులు..కలం విజయం

కాకినాడ పోర్టులో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు తమ బియ్యం ఎగుమతులు చేస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ వసూళ్ల దందా గట్టిగా నడిచింది. కాకినాడ డీ గ్యాంగ్ ఇతర రాష్ట్రాల వ్యాపారులు బియ్యం రవాణా కోసం పోర్టు గొడౌన్స్ కి తీసుకు వచ్చాకా.. దానిని షిప్ లో రవాణా చేయాలంటే డీ గ్యాంగ్ కు డబ్బు కట్టాల్సిందే. మహారాష్ట్రకు చెందిన అనూప్ అగర్వాల్ అనే వ్యాపారి నుంచి ఇలా రెండు కోట్ల వరకూ లాగేశారు.

దీనిపై ఆయన నాగపూర్ లో కేసు పెట్టారు. కానీ, వైసీపీ ప్రభుత్వ పెద్దల సహకారంతో ద్వారంపూడి అండ్ గ్యాంగ్ ఎలా రెచ్చిపోయిందంటే.. అగర్వాల్ అక్కడ కేసు పెట్టిన వెంటనే.. ఆయనపై ఇక్కడ కేసు పెట్టి.. పోలీసుల ద్వారా పిలిపించి బెదిరించారు. దీంతో ఆయన అక్కడ కేసులు వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఇదే తరహాలో కాకినాడ పోర్టులో దందా నడుస్తోంది. 

ఈ వివరాలన్నీ మహాన్యూస్ సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. మహాన్యూస్ కథనాలకు కూటమి ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు కాకినాడ పోర్టులో జరుగుతున్న వ్యవహారాలపై విచారణకు ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. 2022 నుంచి మహా న్యూస్ చేస్తున్న పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కుతోంది. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నా.. ఎక్కడ వెనక్కి తగ్గకుండా చేసిన అలుపెరుగని యుద్ధానికి దక్కుతున్న మహా విజయం ఇది. పేదల పక్షాన మహా న్యూస్ చేసిన పోరాటానికి దక్కిన అద్భుత ఫలితం ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *