Mahaa Vamsi Comment రెండురోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పేట్రేగిపోతున్న రైస్ మాఫియాపై మహాన్యూస్ వరుస కథనాలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. చర్యలకు దిగింది. ఇక్కడ ప్రభుత్వం అంటే.. అక్రమాలను నిలువరించాల్సిన అధికారులు అని అనుకుంటున్నారేమో.. కాదు. స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అర్ధరాత్రి రోడ్డుపై నుంచుని లారీలను చెక్ చేశారు. ఆయన తనిఖీల్లో లారీల్లో అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుబడింది.
- నల్లజర్ల లోని శ్రీ వెంకట సత్య రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు
- కొవ్వూరులో పలు రైసు మిలుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి
- అనంతపల్లి టోల్గేట్ వద్దకు చేరుకుని లోడుతో వెళ్తున్నా వాహనాలను ఆపి కాసేపు తనిఖీలు చేపట్టారు.
ఈ సంఘటనల తరువాత అధికారుల్లో చలనం వచ్చింది. వారు కూడా అక్రమార్కులపై దాడులకు దిగారు.
- అనకాపల్లి జిల్లాలో 20 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
- పాయకరావుపేట నియోజకవర్గం లోని నక్కపల్లి మండలం గుల్లిపాడు రైస్ మిల్లు నుండి లారీలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ ను వేంపాడు టోల్ ప్లాజా వద్ద నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఆ లారీలో 20 టన్నులు బియ్యం.
- అనకాపల్లి జిల్లా ఎస్. రాయ వరం మండలం కొనవాని పాలెం గ్రామంలో ఆటో లో అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
- 780 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్న నక్కపల్లి సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అప్పలనాయుడు
ఇవీ మహా న్యూస్ కథనాల తరువాత అక్రమ బియ్యం తరలింపు విషయంలో వచ్చిన చర్యలు. గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు కొమ్ము కాసిన అధికారులు ఇప్పుడు కూడా అదే పంథాలో ఉన్నారు. కాకినాడ ప్రాంతంలో అన్ని రైస్ మిల్లులను నిలిపివేసిన అధికారులు.. వైసీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రైస్ మిల్లును మాత్రం నడిచేలా చేశారని అక్కడి ఎమ్మెల్యే స్వయంగా చెప్పడం దీనికి రుజువు. అంటే వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఎంతగా నాశనం చేసింది అనేది అర్ధం అవుతోంది. ఈ అధికారులు ఇలా చేయడం వల్లే.. మంత్రి ఈరోజు అర్ధరాత్రి రోడ్ల మీదకు వచ్చి అక్రమాలను ఆపాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో.. నల్లజర్లలో ఆఫ్రికన్ క్వీన్ బ్రాండ్ తో స్విట్జర్లండ్ కంపెనీ బియ్యం బస్తాలు దొరకడం. ఇంత జరుగుతున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు దాడులు చేస్తే తప్ప అధికారులకు తెలియకపోవడం ఇంకా విచిత్రం. ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ రైస్ విషయంలో కఠినంగా ఉండాల్సిన పరిస్థితి అధికారులకు వచ్చింది. అన్ని జిల్లాల్లోనూ దాడులను ముమ్మరం చేస్తున్నారు.
ఇది అలా ఉంచితే.. రైస్ మాఫియా గురించి మాట్లాడుకుంటే కనుక.. గతంలో 5 వేల టన్నుల అక్రమ బియ్యం పట్టుబడింది. అప్పుడు దాని వెనుక ఉన్న కంపెనీలన్నీ వినోద్ అగర్వాల్ అనే వ్యక్తికీ సంబంధించినవిగా తేలింది. అదే వినోద్ అగర్వాల్ తో వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి గట్టి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి తిరిగిన స్నేహంగా తిరిగిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అప్పట్లో చంద్రశేఖర్ రెడ్డి తండ్రి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్. చంద్ర శేఖర్ రెడ్డి తమ్ముడు ఎక్స్పోర్టర్. ఈ నేపథ్యంలో నేరుగా చంద్రశేఖర్ రెడ్డికి ఈ విషయంలో ఎంత సంబంధము ఉన్నది అనేది తెలియకపోయినా.. వినోద్ అగర్వాల్ తో అత్యంత స్నేహం కారణంగా అతను చంద్రశేఖర్ రెడ్డి వ్యవస్థలను ఉపయోగించుకుని ఉండవచ్చు. ఇక అప్పట్లో కాకినాడలో పట్టుబడడంతో.. కొన్నిరోజులు సైలెన్స్ గా ఉన్న వినోద్ అగర్వాల్ ఇప్పుడు రంగంలోకి దిగాడు. కాకినాడ పోర్టులో ఉన్న ఇబ్బందుల వలన తన అడ్డాను గంగవరం పోర్టుకు మార్చాడు.
ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చాల్సి ఉంది. వివిధ పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి.. సౌతాఫ్రికాలోని కంపెనీలతో జట్టు కట్టి.. అక్రమ బియ్యం దందా నడిపిస్తున్న వినోద్ అగర్వాల్.. ఆయన వెనుక ఉండి సహకరిస్తారని ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రశేఖర్ రెడ్డి.. ఇతర నాయకులపై విచారణ జరపాల్సి నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది.
మొత్తంగా చూసుకుంటే, మహా న్యూస్ కథనాలకు మంత్రి స్పందించిన తీరుతో అధికారుల్లో చలనం వస్తే.. రైస్ మాఫియాను కట్టడి చేసే అవకాశం ఉంది.
మరిన్ని మహా వంశీ కామెంట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి