Mahaa Vamsi Coment: అప్పుడలా.. ఇప్పుడిలా .. ఈవీఎంలపై జగన్నాటకం 

Mahaa Vamsi Coment: చేతకాక మంగళవారమన్నాడంట అని ఓ పాపులర్ సామెత. సాధారణంగా ఏదైనా ఆటలో ఓడిపోయినా పిల్లోడు వాడు చీట్ చేశాడు అని చెబుతాడు. పరీక్షల సమయం దాకా బలాదూర్ తిరిగి.. పరీక్షల ముందు రెండు గంటలు పుస్తకం తిరగేసి.. పరీక్ష ఫెయిల్ అయిన స్తూడెంట్.. పేపర్ టఫ్ ఇచ్చారబ్బా అనో.. సరిగ్గా పరీక్ష ముందు నాకు ఆరోగ్యం పాడైందనో వంక చెబుతాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై చేస్తున్న వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. తాను గెలిచి అధికారంలోకి వచ్చినపుడు ఈవీఎంలు చాలా గొప్ప. తానొడిపోతే దానికి కారణం గెలిచిన వారు ఈవీఎంలు టాంపర్ చేశారనే వాదన. చిన్నపిల్లలు, స్తూడెంట్స్ అయినా కాస్త నయమే.. అక్కడితో ఆగిపోతారు. పక్కోడి ఫెయిల్యూర్ కి కూడా అర్జెంట్ గా కారణయాలు వెతికారు. కానీ, జగన్ మాత్రం హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలుపు కూడా ఈవీఎంల పుణ్యమేనంటూ వీధికెక్కారు. అక్కడ ఈయన పోటీ చేసిందీ లేదు.. అంత సినిమా కూడా వైసీపీకి లేదు. హర్యానాలో బీజేపీతో గట్టిగా  తలపడిన కాంగ్రెస్ కూడా తమ ఓటమికి తమ వైఫల్యమే కారణమని అనుకుంటూ ఉంటే .. ఇక్కడ ఏపీలో కూచున్న ఈయన మాత్రం కాంగ్రెస్ కంటే ముందే భుజాలు తడుముకుని బీజేపీ గెలుపు ఈవీఎంల పుణ్యమే అని వ్యాఖ్యానించారు. 

Mahaa Vamsi Coment: అప్పట్లో అంటే 2019లో వైసీపీ 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చినపుడు చంద్రబాబు నాయుడు ఎదో సందర్భంలో ఈవీఎంల వాడకంపై పునరాలోచిస్తే మంచిది అని చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు అందరూ పగలబడి నవ్వుతూ.. చంద్రబాబు మాటలని తిప్పి తిప్పి సాక్షిగా చూపిస్తూ హేళన చేశారు. మీరు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలే ఉన్నాయి కదా అంటూ గేలి చేశాయి. కానీ, ఇప్పుడు అధికారం కోల్పోయాకా జగన్ బ్యాచ్ ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం అంటూ చిన్న పిల్లల్లా తమ ఓటమికి కుంటిసాకులు చెబుతూ పబ్బం గడిపేస్తున్నారు. నిజంగా తమ ఓటమికి.. ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకతకి.. కారణాలు ఏమిటి అనే చర్చ పార్టీలో ఎక్కడా జరగడం లేదు. ఓటమికి బాధ్యత ఈవీఎంలదే  అంటూ ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అవాస్తవాలు.. అనైతిక పద్ధతులు వైసీపీకి కొత్తకాదు. కానీ, ఇప్పుడు తనకు సంబంధం లేని విషయంలో కూడా తలదూర్చుతూ ఎక్కడో హర్యానా ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అంటే, ఇప్పుడు బీజేపీ హర్యానాలో గెలిచిన గెలుపు దుర్మార్గమైనదని జగన్ చెబుతున్నారు. 

Mahaa Vamsi Coment: బీజేపీలో ఉన్న జగన్ ని సమర్ధించే నాయకులూ.. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. జగన్ అసలు స్వరూపం తెలుసుకోండి. బీజేపీని కూడా వదలకుండా తనకు సంబంధం లేకపోయినా.. కాంగ్రెస్ కంటే ముందే ఈవీఎంల పాట ఎత్తుకుని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలు ఆ పార్టీవారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

Mahaa Vamsi Coment: ఈవీఎంలతోనే గెలిచే అవకాశం ఉంటె అబ్ కీ బార్ చార్ సౌ నినాదాన్ని నిజం చేసేసుకునేది బీజీపీ. చిన్నపిల్లవాడికి కూడా తెలిసిన లాజిక్ ఇది. ఆ మాత్రంకూడా సోయి లేకుండా.. జగన్ మాట్లాడుతుండడం.. ఆయనకు, ఆయన పార్టీ  భవిష్యత్ లో చేటు చేస్తుంది తప్పితే, ప్రజాక్షేత్రంలో ఈ వ్యాఖ్యలు ఏమాత్రం మేలు చేయవు. ఈ విషయాన్ని జగన్, ఆయన పార్టీ నాయకులూ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *