Mahaa Vamsi:
రాజకీయాల్లో విశ్వసనీయత గురించి మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు. కానీ, తన విశ్వసనీయతను కచ్చితంగా నిలబెట్టుకునే నేతలు దేశరాజకీయాల్లోనే చాలా అరుదుగా ఉంటారు. వారిలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటారు. చెప్పిన మాటకు కట్టుబడటం. చేసేదానినే చెప్పటం పవన్ కళ్యాణ్ నైజం. ఒక మాట ఇచ్చారంటే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఎవరు ఎలా విమర్షించినా.. ఆ మాటపైనే నిలబడటం పవన్ కళ్యాణ్ పద్దతి. రాజకీయ నాయకుల్లో చాలా అరుదుగా కనిపించే లక్షణాలివి. ఎన్నికల సమయంలో ఒక మాట.. పదవి వచ్చాకా ఇంకోమాట చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ డిక్షనరీలోనే లేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్షనేతగా చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా జైలు పాలు చేస్తే.. తక్షణం ఇది అన్యాయమంటూ స్పందించి చంద్రబాబును జైలులో కలిశారు పవన్. వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ జైలు బయట వెంటనే తాను చంద్రబాబు వెంటే ఉంటానని ప్రకటించారు. అంతేకాకుండా, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ద్వారా ప్రజలోకి వెళతామని.. వైసీపీని ఓడించి తీరుతామని చెప్పారు. అన్నట్టుగానే ఎన్నో ఒత్తిళ్లు.. విమర్శలు.. తిట్లు సొంత పార్టీ లోనే కొందరి సన్నాయి నొక్కుళ్ళు ఇలా ఎన్నో అవరోధాలు వచ్చినా వెనుకడుగు వేయలేదు. చెప్పిన మాటపైనే నిలబడి ఎన్నికలకు సమాయత్తమవ్వడమే కాకుండా.. చెప్పి మరీ వైసీపీని అధఃపాతాళానికి తొక్కేశారు.
ఇప్పుడు వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపొయింది. కొత్త రాజకీయానికి తెరతీసింది. అందులో భాగంగా కూటమి లో చీలికలు తేవడం కోసం అన్నిరకాలుగానూ ప్రయత్నిస్తోంది. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడుల మధ్య ఇప్పటికే ఎన్నో విధాలుగా దూరం ఉందని ప్రజలకు తప్పుడు కథనాలను తన టీమ్స్ ద్వారా ప్రచారం చేస్తూ వస్తోంది. పదే పదే ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే అది నిజం అయిపోతుందని భ్రమలో వైసీపీ రాజకీయాలు చేస్తూ వస్తోంది. అయితే, ఇలాంటి విషయాల పట్ల పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా కూటమి ప్రభుత్వం కొనసాగుతుదని చెబుతూ వస్తున్నారు.
తాజాగా వైసీపీ నుంచి మరింత విస్తృతంగా గోబెల్స్ ప్రచారం అవుతున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ మరోసారి గట్టిగా స్పందించారు. చంద్రబాబు నాయుడు హ్యాట్రిక్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటారు అంటూ విస్పష్టంగా ప్రకటించారు. వైసీపీ గ్లోబల్ ప్రచారానికి చెంపదెబ్బలా పవన్ కళ్యాణ్ ప్రకటన వచ్చింది. ఇచ్చిన మాట తప్పడం అనేదే లేని పవన్ కళ్యాణ్ స్వయంగా ఇలా ప్రకటించడం ఇప్పుడు వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు.
పవన్ సంచలనం..చంద్రబాబే హ్యాట్రిక్ సీఎం.. అంటూ మహా వంశీ ప్రత్యేక విశ్లేషణ ఈ క్రింది వీడియోలో చూడొచ్చు