YCP Leaders: కోర్టు తీర్పు చెప్పలేదు . . రెచ్చిపోకండి!

YCP Leaders: సుప్రీం కోర్టు సుబ్రహ్మణ్యం స్వామి, వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రజలు కొన్ని వాస్తవాలు అర్థం చేసుకోవాలి. సుప్రీం కోర్టు ఈ పిల్ పై ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసింది. నెయ్యి కల్తీ జరిగింది అని పబ్లిక్ లో ఎలా చెప్పేస్తారు అనేది మొదటి ప్రశ్న. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిక్ లో ఆ విషయాన్ని చెప్పలేదు. ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో దీని గురించి వారికి  చెప్పారు. అది తన బాధ్యతగా ఆయన భావించి ఉండవచ్చు. జరుగుతున్న అపచారం తన దృష్టికి వచ్చిన వెంటనే తన మంత్రి వర్గ సహచరులకు, తన ఎమ్మెల్యేలకు విషయాన్ని వివరించి.. ఈ వ్యవహారంలో ఎలా ముందుకు పోవాలనే అంశాన్ని చర్చించడం అవసరమని పార్టీ అధినేతగా.. ముఖ్యమంత్రిగా తన రెస్పాన్సిబిలిటీగా భావించి ఉండవచ్చు.  సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలను ఒకసారి చూద్దాం. 

  • కల్తీ జరిగిన నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించారు?
  • ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారనడానికి ఆధారాలు ఏమిటి?
  • నెయ్యిని ఎప్పుడు పరీక్షలకు పంపారు?
  • లడ్డూలను పరీక్షించారా? లడ్డూలో కల్తీ జరిగిందని తేలిందా?
  • ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా?
  • టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయా? 
  • ల్యాబ్ రిపోర్టులో ఉన్న నెయ్యిని ఉపయోగించితట్టు ఆధారాలు ఉన్నాయా?
  • సీఎం అలా ఎలా మాట్లాడతారు?
  • ఇతర సప్లయర్స్ నుంచి సాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?
  • దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి 
  • నెయ్యి కల్తీ జరిగింది అనడానికి సాక్ష్యాలు చూపించండి. 

కేవలం సుప్రీం కోర్టు ఈ ప్రశ్నలు వేసింది అంతే. దీనికి ప్రభుత్వం లేదా టీటీడీ ఇంకా సమాధానాలు చెప్పలేదు.  సరే కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది పక్కన పెడదాం. 

YCP Leaders: సుప్రీం కోర్టు ప్రశ్నల నేపథ్యంలో ఇందులో  కీలకమైన దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అనే వ్యాఖ్య అందరికీ వర్తిస్తుంది. అయితే, సుప్రీం కోర్టు ప్రశ్నలు అడిగిన వెంటనే వైసీపీ నాయకులు “సత్యమేవ జయతే” అంటూ హోరున ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో సత్యాసత్యాల ప్రస్తావన ఎక్కడుంది? వైసీపీ చేస్తున్న ప్రచారం విషయంలో తప్పనిసరిగా స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ సత్యమేవ జయతే అని మీరు అనాలి కదా. సరే.. ఇప్పుడు నెయ్యి విషయానికి వస్తే.. నెయ్యి కల్తీ జరిగింది అనేది ఐడీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాస్తవం. ఆ నెయ్యి వాడారా లేదా అనేది స్పష్టంగా తేలాలి అనేది కూడా వాస్తవం. 

ALSO READ  Shamshabad: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పలు విమానాల దారి మళ్లింపు

YCP Leaders: అయితే, లాజికల్ గా చెప్పుకుందాం. పది లారీల నెయ్యి ఒకే సంస్థ నుంచి వచ్చింది. అందులో ఆరు లారీల నెయ్యి లడ్డుల్లో వాడటానికి తీసుకున్నారు. ఆ తరువాత అనుమానం వచ్చి నాలుగు లారీలు చెక్ చేశారు. అప్పడు ఆ నెయ్యి కల్తీ అని తేలింది. అంటే, ఒకే కంపెనీ నుంచి వచ్చిన లారీల్లో ఆరు లారీల నెయ్యి స్వచ్ఛమైనది.. నాలుగు లారీల్లో నెయ్యి మాత్రమే కల్తీ అని అర్థమా? ఇక్కడో ఉదాహరణ చెప్పుకోవచ్చు.. మన ఇంట్లో రోజూ పాలు పోయించుకుంటాం. రెండు లీటర్ల పాలు పాలవాడు పోసి వెళ్ళిపోయాడు. అందులో ఒక లీటరు పాలు పొద్దున్నే కాఫీల కోసం మరగా బెడితే.. పాలు విరిగిపోయాయి. ఇప్పుడు మిగిలిన లీటరు పాలు పాడయినట్టా కాదా? సింపుల్ గా విషయం ఇంతే. కోర్టు ప్రశ్నించినంత మాత్రాన విషయం పూర్తి అయిపోయినట్టు కాదు. రాజకీయాలు చేయడం.. దేవుడిపేరుతో రాజకీయాలు నడిపించడం సరికాదు అనే విషయం వైసీపీ మర్చిపోకూడదు. 

YCP Leaders: ఇక సత్యమేవ జయతే అనే క్యాంపెయిన్ ఏదైతే వైసీపీ జోరుగా స్టార్ట్ చేసిందో.. దానిని వైఎస్ వివేకా హత్య కేసులోనూ.. జగన్ అక్రమార్జన కేసుల్లోనూ.. ఇంకా ఐదేళ్ల పాలనలో జరిగిన లోపాల పాపాల విషయంలోనూ ఇదే సత్యమేవ జయతే అనే స్లోగన్ తో ప్రచారం చేస్తే.. ఆ కేసులన్నింటినీ కోర్టు కొట్టేస్తే అప్పుడు వైసీపీ సత్యమేవ జయతే అని పెద్దగా డప్పు కొట్టుకోవచ్చు. దేవుడి విషయంలో ఎలానూ సత్యమే గెలుస్తుంది. వెంటనే కాకపోయినా.. కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది. కానీ, చేసిన అవినీతి పనులను కూడా సత్యమేవ జయతే అంటూ పరీక్షకు పెడితే విషయం తేలిపోతుంది కదా. అన్ని కేసుల్లోంచి బయటపడిపోతే ప్రజలంతా కూడా జగన్ సచ్చిలుడు అని చప్పట్లు కొడతారు కదా. 

YCP Leaders: మళ్ళీ కోర్టు వ్యాఖ్యల విషయానికి వద్దాం. సుప్రీం కోర్టు ప్రశ్నల తరువాత ఈ విషయంలో సిట్ పరిశోధన సరిపోతుందా? లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయిస్తారా? లేక ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలతో దర్యాప్తు చేయిస్తారా? అనే విషయాలను చెప్పడానికి కేంద్రానికి అవకాశం ఇస్తూ అక్టోబర్ 3వ తేదీకి ఈ కేసును వాయిదా వేశారు. ఆరోజు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సీబీఐ కి ఈ కేసును ఇవ్వచ్చు అంటే సీబీఐకి కేసు అప్పగించవచ్చు. లేదు సిట్ సరిపోతుంది అంటే, దానిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవేవీ కాదు స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన విచారణకు ఆదేశిస్తాం అంటే కనుక.. అలా చేసే ఛాన్స్ ఉంది. ఇవన్నీ లోతుగా చూడాల్సిన విషయాలు. మూడో తేదీన ఈ విషయం తేలిపోతుంది. 

ALSO READ  delhi: కవ్వింపు చర్యలకు దిగిన పాక్..

అంతవరకూ వైసీపీ తన సత్యమేవ జయతే పక్కన పెట్టుకుంటే బావుంటుంది. లేదా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల విషయంలో కూడా సత్యమేవ జయతే అనే క్యాప్షన్ తో క్యాంపెయినింగ్ చేసుకుంటే చాలా బావుంటుంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *