BRS On AP Roads: తెలంగాణలో బీఆర్ఎస్ వెన్నెముక లేని రాజకీయాలు చేస్తోందా? మొన్న కేసీఆర్, నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే అలాగే అనిపిస్తోందా? తన ఓటమిని ముందు విశ్లేషించుకోకుండా.. పక్క రాష్ట్రంలో గెలుపోటములపై మాట్లాడుతున్నారు కేసీఆర్. మరోపక్క కేటీఆర్.. ఏపీ రాజకీయాలను, పొలిటికల్ డైలాగులను అచ్చు దింపేస్తున్నారు. ఇలా తెలంగాణలో తండ్రీ కొడుకులు ఇద్దరూ ఏపీ రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. బీఆర్ఎస్ ప్రస్తుత అధినేత, భవిష్యత్ అధినేత… కేసీఆర్, కేటీఆర్‌ల రాజకీయ డ్రామాని, ఏపీ రాజకీయాల చుట్టూ తిరిగే వాళ్ల తిప్పలను ప్రజలు ఎలా చూస్తున్నారు? కీప్ వాచ్ దిస్ స్టోరీ.
ఏపీ రాజకీయ రహదారిపై బీఆర్ఎస్ బండి. ఒకప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అంటే రాష్ట్ర రాజకీయాలకు వెన్నెముక. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ రంగస్థలంలో బీఆర్ఎస్ బండి లాక్ అయిపోయింది. డ్రైవర్ కేసీఆర్, కో-డ్రైవర్ కేటీఆర్ ఇద్దరూ బండిని రిపేర్ చేసే బదులు, పక్క రాష్ట్రం ఏపీ రహదారిపై టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు.
తెలంగాణలో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చుని, “అరెరె, మన బండి ఎందుకు ఆగిపోయింది?” అని ఆలోచిస్తూ కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఆ సైలెన్స్ ఎక్కువ రోజులు ఆగలేదు. కాంగ్రెస్ వైఫల్యాలతో కేసీఆర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ ఊపులోనే గతంలో లేని విధంగా.. కార్యకర్తలు, కింది స్థాయి నేతలతో సైతం తరచూ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సిద్దిపేటలో జరిగిన కార్యకర్తల మీటింగ్‌లో కేసీఆర్ గట్టిగా ఓ కామెంట్ చేశారట. అయితే ఎందుకనో ఆ కామెంట్ ఆఫ్ ది రికార్డ్‌కే పరిమితం చేశారు. అదేంటంటే.. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవారే కాదట. అది విన్న గులాబీ క్యాడర్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారట. మన ఓటమి గురించి మాట్లాడకుండా, పక్క రాష్ట్రంలో గెలుపు గుర్రాలను పెద్ద సారు ఎందుకు లెక్కిస్తున్నట్లు.. అంటూ అయోమయానికి గురవుతున్నారట.
ఇది కూడా చదవండి: TS Honey Trap: అరెరె..ఆ కాల్ మీకూ వచ్చిందా?
ఇక కేటీఆర్ వంతు. తండ్రి కేసీఆర్ ఏపీ రాజకీయ రహదారిలో బండి నడపడం చూసి, “నేనూ తక్కువేం కాదు” అనుకున్నారు. ఒక రోజు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ వేశారు. “ఇన్వెస్ట్‌మెంట్స్ తెలంగాణకు రాకుండా గుజరాత్, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలకు వెళ్తున్నాయి… ఎందుకు?” అంటూనే.. అందులో “ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌కి కూడానా” అంటూ రాసుకొచ్చారు. అంటే పెట్టుబడులకు ఏపీకి అర్హతే లేదన్న అర్థం అందులో స్ఫురించడంతో ఏపీ ప్రజలు ఫైర్ అయ్యారు. కేటీఆర్ డామేజ్ కంట్రోల్‌కి దిగి, “ఏపీ అభివృద్ధి చెందితే సంతోషమే, కానీ తెలంగాణ వెనక్కి వెళ్లకూడదు” అని మరో ట్వీట్ వేశారు.
ఏపీలో ఫేమస్ అయిన పొలిటికల్ డైలాగులను అచ్చం దించేస్తున్నారు కేటీఆర్. “నేను మా నాన్న అంత మంచోడిని అయితే కాదబ్బా” అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్‌కి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన డైలాగ్‌లలో ఒకటి. తెలంగాణలో కేటీఆర్ కూడా అదే పంచ్ డైలాగ్ చెప్పేస్తున్నారు. “నేను మా నాన్న అంత సాఫ్ట్ కాదు, గట్టిగా ఉంటాను!” అంటూ హెచ్చరిస్తున్నారు.
అంతటితో ఆగలేదు. ఏపీలో ప్రతిపక్ష నేత హోదా కోసం పోరాడుతున్న వైస్ జగన్ రీసెంట్ డైలాగ్‌ని సైతం కాపీ, పేస్ట్ చేసేశారు కేటీఆర్. “మా కార్యకర్తలపై కేసులు పెట్టిన వాళ్లు రిటైర్డ్ అయినా, విదేశాల్లో ఉన్నా లాక్కొస్తాం” అంటూ పోలీసులపై బెదిరింపులకు దిగుతున్నారు ఏపీలో జగన్మోహన్‌రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ నోటి నుండి కూడా అదే డైలాగ్. దీంతో.. ఏపీ పొలిటికల్ డైలాగుల్ని కాపీ కొడితే.. తెలంగాణలో సీట్లు వస్తాయా? అంటూ సెటైర్లు పేలుతున్నాయ్.
బీఆర్ఎస్‌కు రాజకీయంగా వెన్నెముక లేకుండా పోయిందా? తెలంగాణలో వెన్నెముకే లేకుంటే, ఏపీ డైలాగులతో బాడీ బిల్డ్ చేస్తారా? కేసీఆర్ చంద్రబాబు గెలుపును విశ్లేషించే ముందు.. తన ఓటమిని రివైండ్ చేసి చూస్తే బాగుండేది కదా? కేటీఆర్ ఏపీ డైలాగులను కాపీ కొడుతూ.. తెలంగాణ సమస్యలపై ఫోకస్ కోల్పోవడం మరింత బలహీనతను బయటపెడుతోందా? ఫైనల్‌గా ఏపీ రాజకీయ స్క్రిప్ట్‌తో తెలంగాణలో సినిమా తీస్తే, టిక్కెట్లు కొనేదెవరు? ఇద్దరూ ఆంధ్రాని, ఆంధ్రా పార్టీలని బూచిగా చూపిస్తూ.. రాజకీయ రంగస్థలాన్ని క్రియేట్ చేసి నటిస్తున్నట్లు కనిపిస్తున్నారు కానీ తెలంగాణ ప్రేక్షకులు ఈ సినిమాకు క్లాప్ కొట్టే మూడ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు.