Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… జనవరి 30 నుంచి 155 సేవలతో వాట్సప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ సేవల సంఖ్య 200గా ఉండగా.. మార్చి నెలాఖరుకు ఆ సంఖ్య 300.. జూన్ నెలాఖరుకల్లా 500 సేవలు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రధానంగా… ఏ సేవనైనా పౌరులు అడిగిన 10 సెకన్లలో అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో జనవరి 30 నుంచి వివిధ శాఖల పరిధిలో సుమరు 1.23 కోట్ల లావాదేవీలు జరగ్గా.. అందులో వాట్సప్ ద్వారా జరిగినవి 51 లక్షలని మంత్రి లోకేష్ తాజాగా వెల్లడించారు.
అయితే… ఈ సర్వీసులపై సహజంగానే ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది వైసీపీ సోషల్‌మీడియా. ఆధార్ నంబర్‌తో సహా పర్సనల్, ప్రైవేట్ డేటా ఈ పోర్టల్ ద్వారా చట్టవిరుద్ధంగా షేర్ చేయబడుతోందంటూ ప్రచారం మొదలెట్టాయి వైసీపీ సోషల్ సైకో బ్యాచ్‌లు. వాట్సాప్ గవర్నెన్స్ ఎంత మాత్రం సేఫ్ కాదంటూ వైసీపీ అనుకూల మీడియాలో డిబేట్లు కూడా పెడుతున్నారు. దీంతో… ఈ తరహా ప్రచారంపై మండిపడిన లోకేష్… రూ.10 కోట్ల ఛాలెంజ్ విసిరారు. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సప్ గవర్నెన్స్ లో పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. అయినప్పటికీ పేటీఎం బ్యాచ్‌లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
Lokesh: వాట్సప్ గవర్నెన్స్ లో ఎక్కడైనా హ్యాకింగ్ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తామని సవాల్ చేసినట్లు తెలిపారు మంత్రి లోకేష్. అయితే… తన సవాల్‌కు ఎవరూ స్పందించలేదని కూడా వెళ్లడించారు. విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా హాల్ టిక్కెట్లు పోందారని.. రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా దీని ద్వారా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సమయంలోనే వైఎస్ జగన్‌కు మొబైల్ ఫోన్ కొనివ్వాలని ఆర్థిక మంత్రికి పయ్యావుల సూచించారు.
Also Read: Pawan Kalyan: అప్పుడు, ఇప్పుడు అదే పవన్!
గతంలో జగన్ మోహన్ రెడ్డి ఓ మీడియా చానల్‌కి ఇంటర్వూ ఇచ్చిన సందర్భంగా తనకి ఫోన్ లేదు, నంబర్ లేదంటూ పేర్కొన్న విషయాన్ని సందర్భోచితంగా గుర్తు చేశారు మంత్రి పయ్యావుల. వెంటనే అందుకున్న లోకేష్.. వాట్సప్ గవర్నెన్స్‌పై పేటీఎం బ్యాచ్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడుతూనే.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోన్ వాడరంటున్నారనీ.. అందువల్ల ఆర్థిక మంత్రి కేశవ్ ఒక ఫోన్ కొని, అందులో వాట్సప్ గవర్నెన్స్ లోడ్ చేసి పంపిస్తే.. అప్పుడైనా నేర్చుకుంటారేమోనని ఎద్దేవా చేశారు.
