YCP MLA’S: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతున్నారా? శాసనసభ సమావేశాలకు వస్తున్నారా? వస్తే ఎందుకు కనిపించడం లేదు? రిజిస్టర్లో సంతకాలు పెడుతున్న వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు దీనిపైనే స్పష్టమైన ప్రకటన చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వర రాజు, అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధలు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
ప్రజా ప్రతినిధులుగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని.. ముఖం చాటేయడం ఎందుకని.. గౌరవంగా సభకు రావొచ్చని సూచించారు. హాజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదు అంటూ కామెంట్ చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇప్పుడు ఈ ఏడుగురు వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. అసలు వారు ఎందుకు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. అటు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు.. ఇటు ఎమ్మెల్యే పదవుల్ని వదులుకునేందుకు సిద్దంగా లేరు. చివరికి దొంగచాటుగా సంతకాలు పెట్టి ఇలా దొరికిపోయారు.
“కొందరు ప్రజా ప్రతినిధులు దొంగల్లా మారారు. గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికీ కనిపించకుండా అసెంబ్లీ సెక్రటేరియెట్‌కు వచ్చి అటెండెన్స్‌లో సంతకాలు చేస్తున్నారు. ఆ తర్వాత.. సభకు రాకుండా సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు.“ అని స్పీకర్ వ్యాఖ్యానించడం నిజంగా వైసీపీకి సిగ్గు చేటు అంటున్నారు.
Also Read: YS Jagan: జగన్ పర్యటనల లోగుట్టు వేరే ఉందా?
రాజకీయ విశ్లేషకులు. కాగా.. ఈ వ్యాఖ్యలు.. కేవలం వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాత్రమే చేసినవి కాదని.. కొందరు టీడీపీ సభ్యులు సైతం కేవలం అటెండెన్స్‌లో సంతకం మాత్రం పెట్టి.. సభలో కూర్చోకుండా వెళ్లిపోతున్నారనీ… అది గమనించిన స్పీకర్.. ఈ రకంగా వ్యాఖ్యానించాల్సి వచ్చిందని… మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా… స్పీకర్ అయ్యన్న సూక్ష్మ దృష్టి కారణంగా… వైసీపీ ఏడుగురు ఎమ్మెల్యేలు అవుట్‌డోర్ స్టేడియంలో దాగుడు మూతలు ఆడి దారుణంగా దొరికిపోయారన్నది మాత్రం వాస్తవం అధ్యక్ష్యా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.