BRS Counter to Budget

BRS Counter to Budget: రక్తకన్నీరు సినిమాలో నాగభూషణం డైలాగ్‌లా భట్టి పద్దు!

BRS Counter to Budget: తెలంగాణలో అసెంబ్లీలో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్‌ 3,04,965 కోట్లుగా.. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లుగా.. మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా చూపారు. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి జోడు గుర్రాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికార పీఠం హోదాగా భావించడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో సవాళ్లను అధిగమించామన్నారు. అంబేద్కర్ సూచించిన నైతిక విలువలు పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. ప్రజల కోసం బాధ్యతగా వ్యవహరిస్తున్నమన్న భట్టి…. రైతు భరోసా 18 వేల కోట్లు, వ్యవసాయ రంగానికి 24, 439 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక శాఖకు 1674 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 5734 కోట్లు కేటాయించారు.

విద్యాశాఖకు 23,108 కోట్లు, కార్మిక ఉపాధి కల్పనకు 900 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, మహిళా శిశుసంక్షేమశాఖకు 2862 కోట్లు, షెడ్యూల్ కులాలకు 40,232 కోట్లు, షెడ్యూల్ తెగలకు 17,169 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 11,405 కోట్లు, చేనేత రంగానికి 371, ఐటి శాఖకు 774 కోట్లు, విద్యుత్ శాఖకు 21,221 కోట్లు, విద్యా శాఖకు 12,393 కోట్లు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు 17,677 కోట్లు, నీటి పారుదల శాఖకు 23,373 కోట్లు.. రోడ్డు, భవనాల శాఖకు 5,907 కోట్లు, పర్యాటక శాఖకు 775 కోట్లు ప్రతిపాదనలు పెట్టింది ప్రభుత్వం. అదే విధంగా క్రీడా శాఖకు 465 కోట్లు, అడవులు, పర్యావరణ శాఖకు 1023 కోట్లు, దేవాదాయ శాఖకు 190 కోట్లు, హోమ్ శాఖకు 10, 188 కోట్లు కేటాయించింది. ఇక బడ్జెట్‌లో మహాలక్ష్మి పథకంలో భాగంగా పెన్షన్ పెంపు, తులం బంగారం ప్రస్తావన చేయలేదు.

BRS Counter to Budget: బడ్జెట్‌లో కీలక అంశాలైన వాటిలో స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ 29,899 కోట్లు వస్తాయని, టాక్స్ రెవెన్యూ 2025-26లో 1,45,419 కోట్లు, నాన్ టాక్స్ రెవెన్యూ 31,618 కోట్లు, గ్రాంట్స్ ఏడెడ్ 22,789 కోట్లు చూపించారు. అదే విధంగా ఓపెన్ మార్కెట్ లోన్స్ 2025-26లో 64,539 కోట్లు తెస్తున్నట్లు, లోన్స్ ఫ్రమ్‌ సెంట్రల్ 4 వేల కోట్లు, ఇతర లోన్లు 1000 కోట్లు రానున్నట్లు చూపించారు. తీసుకున్న అప్పులకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ 19,369 కోట్లు కట్టాల్సి ఉంటదని పేర్కొన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,504 కోట్లు, లోన్స్ అండ్ అడ్వాన్స్ 21,350 కోట్లుగా బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపెట్టింది. ఓవరాల్‌గా మిగులు బడ్జెట్ అనే పదమే బడ్జెట్ పుస్తకంలో చూపించలేదు. అదే విధంగా పూర్తిస్థాయి బడ్జెట్ 3.4 లక్షల కోట్లు కాగా ఒరిజినల్ బడ్జెట్ 2 లక్షల 26 వేల కోట్లు అనేది చూపించింది ప్రభుత్వం.

Also Read: Kavvampalli Vs RasamayIi: సై అంటే సై.. మానుకొండూరు మంటలు!

BRS Counter to Budget: భట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. బీజేపీ, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బడ్జెట్ వాస్తవానికి విరుద్ధంగా ఉందన్నారు. బడ్జెట్ లో భట్టి అబద్ధాలు, అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారని కేటీఆర్ విమర్శించారు. రక్త కన్నీరు సినిమాలో నాగభూషణం డైలాగ్‌లా భట్టి బడ్జెట్ ప్రసంగం సాగిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా, ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులున్నాయని బీజేపీ ఎమ్మేల్యేలు విమర్శించారు.

అయితే బడ్జెట్ కేటాయింపులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలకు ఎక్కువ మొత్తంలో ఉండగా.. కొండ సురేఖ, శ్రీధర్ బాబు దగ్గర ఉన్నటువంటి శాఖలకు తక్కువ కేటాయింపులు జరిగాయి. అయితే తలసరి ఆదాయం గ్రోత్ ఎక్కువగా చూపించినప్పటికీ బడ్జెట్ అంకెలను పెంచి చూపించలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంపై రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *