Mahaa Conclave

Mahaa Conclave: మంత్రి లోకేష్ కేవలం 45 నిమిషాలోనే.. ఆర్సెల్లార్ మిట్టల్‌ను ఏపీకి తెచ్చారు..భారత్

Mahaa Conclave: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం మెగా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ‘మహాన్యూస్’ ఆధ్వర్యంలో మహా గ్రూప్ సంస్థల సీఎండీ మారెళ్ల వంశీ కృష్ణ నేతృత్వంలో జరిగిన ‘రైజింగ్ ఏపీ మహా కాన్‌క్లేవ్’ రాష్ట్ర పారిశ్రామిక మరియు ఆర్థిక భవిష్యత్తుపై కీలక చర్చా వేదికైంది. ఈ కాన్‌క్లేవ్‌లో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రభుత్వ లక్ష్యాలను, పెట్టుబడి వ్యూహాలను వివరించారు.

పాలనా నినాదం: ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’

మంత్రి టీజీ భరత్  గత ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెడుతూ, నూతన పాలనా విధానాన్ని స్పష్టం చేశారు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన సదస్సుల్లో పెద్దగా పెట్టుబడులు రాలేదని, ఉద్యోగ, ఉపాధి కల్పనను వైసీపీ గాలికొదిలేసిందని భరత్ ఆరోపించారు. జగన్ హయాంలో పెట్టుబడిదారులు ముందుకు రాలేదని, లుల్లూ వంటి సంస్థలు అవమానంతో లేఖ రాసి వెళ్లిపోయాయని గుర్తు చేశారు.

చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీని ప్రభుత్వం ఇప్పుడు ఉపయోగించుకుంటోందని, వ్యాపారం రిస్క్‌తో కూడుకున్నదని, అందుకే భద్రత లేనిదే వ్యాపారం జరగదని టీజీ భరత్ అన్నారు. పారిశ్రామికవేత్తలు భయపడుతున్నా, చంద్రబాబు, లోకేష్ వారిలో నమ్మకం కలిగిస్తున్నారని  తెలిపారు.

ఇది కూడా చదవండి: Mahaa Conclave: ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తున్నామనేది ముఖ్యం..ఎంపీ భరత్

‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ కాదు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నినాదంతో సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారని, రాయితీల కంటే వేగంగా అనుమతులు ఇవ్వడంపైనే కంపెనీలు ఆసక్తి చూపుతాయని మంత్రి భరత్ స్పష్టం చేశారు. ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డును మొదట ప్రారంభించింది కూడా చంద్రబాబేనని గుర్తు చేశారు.

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డ్రైవ్: లోకేష్ విజయం

ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో చదివిన లోకేష్ లాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజకీయాల్లో ఉండటం అవసరమని మంత్రి టీజీ భరత్ అన్నారు. లోకేష్ చొరవతోనే భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని తెలిపారు.

కేవలం 45 నిమిషాల జూమ్ కాల్‌తో మంత్రి లోకేష్ ఆర్సెల్లార్ మిట్టల్‌ను ఏపీకి తీసుకురాగలిగారని మంత్రి భరత్ వెల్లడించారు. గతంలో గూగుల్ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపగానే, లోకేష్ విశాఖలోనే గూగుల్ ప్రతినిధులతో సమావేశమయ్యారని, మొదట రూ.50 వేల కోట్ల పెట్టుబడి రూ.1 లక్ష 30 వేల కోట్లకు చేరిందని భరత్ వివరించారు. 2019లో ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని ఆరోపించారు.

గతంలో వైసీపీ కారణంగా వెళ్లిపోయిన లుల్లూ సంస్థను తిరిగి పెట్టుబడులు పెట్టాలని కోరామని, ప్రభుత్వం ఒప్పించడంతో ఆ సంస్థ మళ్లీ ముందుకొస్తుందని శ్రీభరత్ తెలిపారు.

ఇది కూడా చదవండి: MP Bharat: తేజస్విని యాడ్ పై స్పందించిన భారత్..

 సీఐఐ సదస్సు, లక్ష్యాలు, మరియు పంపిణీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 9 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు.ఈ సదస్సులో 410 ఎంవోయూలు జరిగి, రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయని, విశాఖకు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భరత్ తెలిపారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రతి జిల్లాకు పెట్టుబడులు తీసుకురావడమే కూటమి లక్ష్యమని, అమరావతిని క్వాంటమ్ వాలీ కేంద్రంగా, ఉత్తరాంధ్రలో స్టీల్, ఫార్మా, బయోటిక్ రంగాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *