Maha Shivaratri 2025: హరహర మహాదేవ్.. శంభో శంకర.. దిక్కులన్నీ ఏకమయ్యేలా ఆసేతు హిమాచలం శివనామస్మరణ మారుమ్రోగుతోంది. అందర్నీ ఆదరించే ఆది దేవుడు.. నమఃశ్శివాయ అన్నంతనే భక్తకోటి కష్టాన్ని తీర్చేసే గరళకంఠుడు.. ఆర్తితో శంకరా అని పిలిస్తే నేనున్నాను అంటూ ఆదరించే బోళా శంకరుడు.. భక్తజనవత్సలుడిగా నిరంతరం లోకాలన్నిటినీ కాచే మహా శివుడు.. ఇలా ఎవరు ఏ రకంగా తలిచినా తరింప చేసే మహా యోగి శివునికి శివరాత్రి పర్వదిన సందర్భంగా సకల మానవాళి తమ భక్తితో అభిషేకిస్తున్నారు. ఓం నమఃశ్శివాయ అంటూ ఆలయాల్లో పరమశివునికి ప్రార్ధనలు చేస్తున్నారు. దేశంలో ప్రతి శివ క్షేత్రం హరుని నామస్మరణతో ప్రతిధ్వనిస్తోంది.
ఇది కూడా చదవండి: Mahaa Bhakti: మహా భక్తి ఛానల్ ఆవిష్కరణ సందర్భంగా వినూత్న రీతిలో మహా గ్రూప్ నకు శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని క్షేత్రాలు తెల్లవారు జామునుంచే భక్తుల తాకిడితో సందడిగా మారాయి. అటు పంచారామ క్షేత్రాలు.. ఇటు శ్రీశైలం, శీకాళహస్తి మరోవైపు వేములవాడ ఇలా ఒక్కటేమిటి ప్రతి శైవ క్షేత్రంలోనూ భక్తజనం శివనామస్మరణతో పులకరించిపోతున్నారు. ఊరూ.. వాడా.. శివాలయాల్లోనే కాకుండా.. అన్ని ఆలయాల్లోనూ శివరాత్రి శోభ కనిపిస్తోంది. ఉపవాస దీక్షతో శివయ్యను మనసారా కొలుస్తూ.. ప్రజలు తరించిపోతున్నారు.
- నేటితో ముగియనున్న మహాకుంభమేళా
- చివరిరోజు ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తుతున్న భక్తులు
- త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు
- భక్తుల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు
- విజయవాడ: ఇవాళ ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి పూజలు
- సా.5 గంటల వరకు మల్లేశ్వరస్వామికి త్రికాల అభిషేకం
- రాత్రి 9 గంటల నుంచి మహన్యాసం, లింగోద్భవ అభిషేకం
- రాత్రి 11 గంటల నుంచి పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి కల్యాణం
- మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి..
- కోటప్పకొండ, వేములవాడ ఆలయల్లో ప్రత్యేక పూజలు
- దేశవ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు
- శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
- శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మొత్సవాలు
- శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
- భక్తుల రద్దీ దృష్యా పలు ఆర్జిత సేవలు రద్దు
- సాయంత్రం 5:30కు స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం
- రా.7కు నంది వాహన సేవ, రా.10కి పాగాలంకరణ
- రా.10కి రుద్రాభిషేకం, రా.12 గంటలకు బ్రహ్మోత్సవ కల్యాణం