Maha kumbh stampede: ప్రయాగ్‌రాజ్‌లోని సంగం తీరంలో మంగళవారం-బుధవారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా రిపోర్ట్స్ ప్రకారం అక్కడి స్వరూపాణి ఆసుపత్రికి 14 మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తీసుకువచ్చారు. అయితే, మృతుల సంఖ్య లేదా గాయపడిన వారి సంఖ్యకు సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదు.
Maha kumbh stampede: తొక్కిసలాట తర్వాత, అక్కడి అధికారుల అభ్యర్థన మేరకు, మొత్తం 13 అఖారాలు ఈరోజు మౌని అమావాస్య అమృత స్నానాన్ని రద్దు చేశాయి. అఖారా పరిషత్ ప్రెసిడెంట్ రవీంద్ర పూరి మాట్లాడుతూ – సంగం నోస్ వద్ద అధిక రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీఎం యోగితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై ఆయన ఆరా తీశారు.
Maha kumbh stampede: అక్కడ నుంచి జాతీయ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఒక పుకారు కారణంగా సంగం నోస్ వద్ద తొక్కిసలాట జరిగింది. కొందరు మహిళలు నేలపై పడగా, ప్రజలు వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ప్రమాదం తర్వాత 70కి పైగా అంబులెన్స్‌లు సంగం వద్దకు చేరుకున్నాయి. క్షతగాత్రులను, మృతులను ఆస్పత్రికి తరలించారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh: Rescue operations are underway after a stampede-like situation arose in Maha Kumbh and several people were reported injured. https://t.co/4z63F7pAS9 pic.twitter.com/YxZHXIoy51
— ANI (@ANI) January 29, 2025
Maha kumbh stampede: ప్రమాదం తర్వాత, NSG కమాండోలు సంగం బ్యాంకులో బాధ్యతలు చేపట్టారు. సంగం ప్రాంతంలోకి సామాన్య ప్రజల ప్రవేశం నిలిపివేశారు. ప్రయాగ్‌రాజ్‌లో రద్దీ మరింత పెరగకుండా, భక్తులను నిలువరించేందుకు ప్రయాగ్‌రాజ్ నగర సరిహద్దులోని అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉంచారు.
Maha kumbh stampede: ఈ రోజు మహాకుంభంలో మౌని అమావాస్య స్నానం ఉంది. దీని కారణంగా నగరంలో సుమారు 5 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. అధికారులు చెబుతున్నదాని ప్రకారం అర్థరాత్రి 8 నుండి 10 కోట్ల మంది భక్తులు సంగం సహా 44 ఘాట్‌లలో స్నానం చేసే అవకాశం ఉంది.
దీనికి ఒక్కరోజు ముందు మంగళవారం 5.5 కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానాలు చేశారు. 60 వేల మందికి పైగా సైనికులు భద్రత కోసం మోహరించారు.
కాగా . . మహా కుంభమేళా తొక్కిసలాటలో వందలాది మంది గల్లంతయ్యారు. తప్పిపోయిన మరియు దొరికిన కేంద్రాలలో కుటుంబాలు తమ ప్రియమైనవారి కోసం వెతుకుతున్నాయి.
మేళా కోసం అక్కడ విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్ డ్యూటీ అధికారి ఆకాంక్ష రాణా మాట్లాడుతూ, “సంగం వద్ద బారికేడ్స్ విరిగిపోవడంతో కొంతమంది గాయపడ్డారు. ఆసుపత్రి పాలయ్యారు. గాయపడిన వారి ఖచ్చితమైన లెక్క ఇంకా మాకు అందుబాటులో లేదు అని చెప్పారు .
సీఎం యోగితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని..
మహా కుంభమేళా పరిస్థితిపై ప్రధాని మోదీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి, పరిణామాలను సమీక్షించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
ఈవార్త అప్ డేట్ అవుతోంది . .