Maha Kumbh Mela 2025: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహా కుంభమేళాకు చివరిరోజైన బుధవారం భక్తజనం పోటెత్తారు. మహాశివరాత్రి పర్యదినం కావడంతో ముందురోజు నుంచి పుణ్యస్నానాలకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం పరిసరాలు భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. హరహర మహాదేవ నినాదాలతో మారుమోగింది.
Maha Kumbh Mela 2025: 144 ఏండ్లకోసారి వచ్చే మహాకుంభమేళా 45 రోజులపాటు ఘనంగా కొనసాగింది. దేశంలోని అన్నిప్రాంతాల నుంచి హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా తరలిరావడం విశేషం. వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి, ఇక్కడి ఆధ్యాత్మిక గొప్పతనాన్ని తెలుసుకొని వెళ్లారు.
Maha Kumbh Mela 2025: మహాశివరాత్రి పర్వదినం ముందు రోజు అర్ధరాత్రి నుంచి భక్తులు త్రివేణి సంగమంలో చివరి పుణ్యస్నానం ఆచరించడానికి సిద్ధమయ్యారు. బ్రహ్మముమూర్తం సమయం నుంచి ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం మొదలుపెట్టారు. మహాకుంభ మేళా చివరిరోజున భక్తుల పుణ్యస్నానాల ఆచరణ, పూజా కార్యక్రమాలను డ్రోన్ విజువల్స్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చిత్రీకరించింది.
Maha Kumbh Mela 2025: ఇప్పటి వరకు దాదాపు 65 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ రోజు పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 70 లక్షలు దాటొచ్చని అంచనా. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి చేరుకుంటూనే ఉన్నారు. మరోవైపు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు.