Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను ఓడినా నైతిక విజయం మాత్రం తనదేనని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం యూసుఫ్‌గూడలో తోటి కార్యకర్తలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు కీలక ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో రౌడీయిజం, నగదు పారించి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని ఆమె ఆరోపించారు.
Maganti Sunitha: ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాఫ్ అయిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఆరోపించారు. రౌడీల కనుసన్నల్లోనే ఈ ఎన్నికలు జరిగాయని తెలిపారు. ఒక ఆడబిడ్డను ఎంతగా హింసించాలో అంతగా హింసించి ఈ ఎన్నికల్లో ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలింగ్ కేంద్రాలకు తాము వెళ్లినప్పుడు రౌడీ గ్యాంగులు ర్యాగింగ్ చేశాయని ఆవేదన వ్యక్తంచేశారు.
Maganti Sunitha: రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అంతగా మెజార్టీ వచ్చిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తాను ఏడ్చినా, నవ్వినా తప్పే అన్నట్టు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో తనదే నైతిక విజయమని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమై డిపాజిట్‌ను కోల్పోయారు.

