Madras High Court:నీవు ఉన్నత విద్యాభ్యాసం చేశావు కదా.. ఉద్యోగం చేసుకోవచ్చు కదా.. అంటూ తన భర్త నుంచి భరణం కోరిన ముంబై మహిళను సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్దిరోజుల్లో భరణం విషయంలో మద్రాస్ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. ఇటీవల కాలంలో భర్త నుంచి వేరవుతున్న మహిళల విషయంలో భరణం సమస్యగా మారుతుంది. ఎంత మొత్తంలో ఇవ్వాలన్న విషయంలో ఈ సమస్య జటిలమవుతుంది.
Madras High Court:చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు ఈ కీలక తీర్పును జారీ చేసింది. ఈ కేసు విచారణలో భార్యకు అధిక మొత్తంలో ఆస్తులు, ఆదాయం ఉన్నట్టు తేలింది. భార్యకు అధికాదాయం ఉంటే ఆమె భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కూడా మద్రాస్ హైకోర్టు రద్దు చేయడం విశేషం.
Madras High Court:ఇదే కేసు విషయంలో ఫ్యామిలీ కోర్టు ఓ తీర్పును ఇచ్చింది. భార్యకు నెలనెలా రూ.30 వేల చొప్పున భరణం ఇవ్వాలని తీర్పునిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దానిని హైకోర్టు రద్దు చేయడం గమనార్హం. వారి కుమారుడి చదువుకు అయ్యే ఖర్చుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదని వెల్లడించింది.