Madhya Pradesh: మైనర్లకు స్మార్ట్ ఫోన్ ఇవ్వొద్దని మానసిక విశ్లేషకులు ఇటీవల కాలంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ, కన్న ప్రేమ ఆ మానసిక విశ్లేషకుల హెచ్చరికను హైజాక్ చేసేస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతూనే ఉన్నారు. ఇలా ఫోన్ వాడకంతో ఎంతో మంది మైనర్లు మానసిక రోగాలకు గురవుతున్నారు. మరికొందరు తెలిసీ, తెలియక నష్టాలపాలై ప్రాణాలనే తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా తాజాగా ఓ మైనర్ పరిస్థితి చేరింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో 13 ఏళ్ల వయసున్న ఆక్లన్ జైన్ అనే బాలుడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడాడు. ఆ గేమ్‌లో రూ.2,800 పోగొట్టుకున్నాడు. తన గేమింగ్ ఐడీకి అతను తన తల్లి డెబిట్ కార్డు లింక్ చేస్తానని, గేమ్ ఆడి రూ.2,800 నష్టపోయానని తల్లికి చెప్పాడు. దీంతో ఆమె ఏం చేస్తుందోననే భయంపెట్టుకున్నాడు.
Madhya Pradesh: గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్నందుకు తల్లి ఏం చేస్తుందోనన్న భయంతో ఆక్లన్ జైన్ తన ఇంటిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 13 ఏళ్ల వయసున్న ఆక్లన్ జైన్ అనవసరంగా ఆన్‌లైన్ గేమ్ ఆడి డబ్బు పోగొట్టుకొని, చివరికి తన ప్రాణాన్నే తీసుకున్నాడు. ఇలాంటి దశలో ఎందరో పిల్లలు ఉండి ఉంటారు. ఇప్పటికైనా మీ ఇళ్లలో మైనర్లకు స్మార్ట్ ఫోన్లను దూరంగా ఉంచండి. బాధ్యతలు చెప్పండి.. అని మానసిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.