Madhavi Latha:

Madhavi Latha: జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై న‌టి మాధ‌వీల‌త ఫిర్యాదు

Madhavi Latha: మాజీ ఎమ్మెల్యే, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న‌పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై సినీ న‌టి మాధ‌వీల‌త మా అసోసియేష‌న్‌కు శ‌నివారం ఫిర్యాదు చేశారు. త‌న‌పై జేసీ అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంత‌కు ముందే హెచ్చార్సీ, పోలీసుల‌కూ ఫిర్యాదు చేసిన‌ట్టు మాధ‌వీల‌త వెల్ల‌డించారు. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న‌పై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని ఆమె పేర్కొన్నారు.

Madhavi Latha: త‌న‌పై జేసీ చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ ఇండస్ట్రీ ఖండిచంలేద‌ని, అందుకే మా అసోసియేష‌న్‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు ఆమె తెలిపారు. మా అసోసియేష‌న్ ట్రెజ‌ర‌ర్ శివ‌బాలాజీకి ఆమె త‌న ఫిర్యాదును అంద‌జేశారు. త‌న ఫిర్యాదును మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లాన‌ని తెలిపారు. సినిమా వాళ్ల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణ‌మ‌ని, వ్య‌క్తిత్వ హ‌నం చేయ‌డం అమానుష‌మ‌ని మాధ‌వీల‌త పేర్కొన్నారు.

Madhavi Latha: రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని, వ్య‌క్తిగ‌త జీవితాల‌పై మాట్లాడ‌టం స‌రికాద‌ని ఈ సంద‌ర్భంగా శివ‌బాలాజీ హిత‌వు ప‌లికారు. రాజ‌కీయ నాయ‌కులు సినీ రంగం జోలికి రావ‌ద్ద‌ని కోరారు. మాధ‌వీల‌త ఫిర్యాదుపై క‌మిటీలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని శివ‌బాలాజీ తెలిపారు.
మాధ‌వీల‌తపై జేసీ వ్యాఖ్య‌లేమిటి అంటే?
Madhavi Latha: గ‌త డిసెంబ‌ర్ 31న నూత‌న సంవత్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా తాడిప‌త్రిలో జేసీ పార్కులో మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే అంటూ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మ‌హిళ‌లు వెళ్ల‌వ‌ద్ద‌ని, అర్ధ‌రాత్రి దాటాక ఇండ్ల‌కు వ‌స్తుంటే ఏమైనా జ‌రిగితే ఎవరిది బాధ్య‌త అంటూ మాధ‌వీల‌త సూచించారు. దీంతో జేసీ ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. దీనికి మాధ‌వీల‌త ఘాటుగానే స్పందించ‌గా, ఆ త‌ర్వాత జేసీ క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Warangal: కాకతీయ విశ్విద్యాలయంలో ఉద్రిక్తత..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *