Madaram Jathara:

Madaram Jathara: మేడారం మ‌హా మేడారం జాత‌రకు ఏర్పాట్లు ముమ్మ‌రం.. 3495 బస్సులు..

Madaram Jathara: ములుగు జిల్లాలోని మేడారంలోని స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ మ‌హా జాత‌ర‌కు ముమ్మ‌ర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా కోట్లాది రూపాయ‌ల‌తో నూత‌న ప‌నుల‌ను చేప‌ట్టింది. దీనికోసం మంత్రులు ద‌గ్గరుండి పర్య‌వేక్షిస్తున్నారు. ఈ మేర‌కు 2026 జ‌న‌వ‌రి 28 నుంచి31 వ‌ర‌కు మేడారం మ‌హాజాత‌రను నిర్వ‌హించ‌నున్నారు.

Madaram Jathara: మేడారం మ‌హాజాత‌ర కోసం టీజీఎస్ ఆర్టీసీ సంస్థ నుంచి 3495 బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. మేడారం ఆల‌య స‌మీపంలోనే 28 ఎక‌రాల్లో బ‌స్టాండ్‌, క్యూలైన్లు, భ‌క్తులు వేచి ఉండే గ‌దుల నిర్మాణ‌ప‌నులు కొన‌సాగుతున్నాయి. జ‌న‌వ‌రి 25వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు ఈ ప్ర‌త్యేక బ‌స్సులు అందుబాటులో ఉంటాయి.

Madaram Jathara: మ‌హాజాత‌ర తొలి రోజైన జ‌న‌వ‌రి 28న బుధ‌వారం క‌న్నెప‌ల్లి నుంచి సార‌ల‌మ్మ‌, కొండాయి నుంచి గోవింద‌రాజులు, పూనుగొండ్ల నుంచి ప‌గిడిద్ద‌రాజు మేడారంలోని గ‌ద్దెల‌పై చేరుకోనున్నారు. అదే నెల 29న చిలుక‌ల‌గుట్ట నుంచి స‌మ్మ‌క్క‌ను తీసుకొచ్చి గ‌ద్దెపై ప్ర‌తిష్ఠిస్తారు. 30న భ‌క్తులు మొక్కుల‌ను స‌మ‌ర్పించుకోనున్నారు. 31న సాయంత్రం 6గంట‌ల‌కు అమ్మ‌వార్ల‌ను తిరిగి వ‌న‌ప్ర‌వేశం చేస్తారు.

Madaram Jathara: మేడారం మ‌హాజాత‌ర 2026 పోస్ట‌ర్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి.. జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో ఆవిష్క‌రించారు. మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి స‌మ్మ‌క్క త‌ల్లి కంక‌ణం క‌ట్టి, బొట్టు పెట్టి జాత‌ర‌కు ఆహ్వానం ప‌లికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *