Madaram Jathara 2026:మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఇంకా 16 రోజుల గడువు ఉన్నది. జనవరి 28 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర సాగుతుంది. లక్షలాది మంది తరలివస్తారు. మొత్తంగా చూస్తే కోట్లల్లో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కానీ, ఇప్పటికే లక్షలాది మంది మేడారం వైపు దారులు కట్టారు. ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జాతర ప్రారంభానికి ముందే లక్షలాది మంది వస్తున్నారు.
Madaram Jathara 2026:భక్తుల రాకతో మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చకుంటున్నారు. భారీ జనసందోహం రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిన్న (జనవరి 10) ఒక్కరోజే సుమారు రెండు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని అంచనా.
Madaram Jathara 2026:భక్తల రాకతో పస్ర, మేడారం మధ్య ట్రాఫిక్ రద్దీ భారీగా పెరిగింది. నార్లపూర్, కొత్తూరు, జంపన్నవాగు వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్ద బంగారం (బెల్లం) సమర్పించి ముందస్తు మొక్కులు తీర్చకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ప్రత్యేక వైద్య సదుపాయాలను అందిస్తున్నది. ఇప్పటికే పారిశుధ్య చర్యల కోసం సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. జనవరి 11న ఆదివారం కావడంతో రెట్టింపు స్థాయిలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
