Madan Lal on Mohammad Yousuf: టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరును సరిగ్గా పలకని యూసఫ్‌పై మాజీ క్రికెటర్ మదన్‌లాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనికి స్పందిస్తూ, మదన్ లాల్ పాకిస్థాన్ ఆటగాళ్లను పబ్లిసిటీ కోసమే ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తమ ఓటమిని అంగీకరించలేక ఇలా దిగజారుతున్నారు. అనవసరంగా వారిపై స్పందించడం ద్వారా మనం వారికి పబ్లిసిటీ కల్పించినట్లు అవుతుంది. వారు కోరుకునేది కూడా అదే.” అని మదన్ లాల్ పేర్కొన్నారు.ఓటమిని అంగీకరించకుండా, ఇతర ఆటగాళ్లను దూషించడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం.
ఇది కూడా చదవండి: Nirmala Sitharaman: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఊరట: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
మైదానంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఊహించుకొని మాట్లాడడం సరికాదు అని మదన్ లాల్ వ్యాఖ్యానించారు. అంపైరింగ్‌పైనా అసహనం వ్యక్తం చేయడం ఆశ్చర్యమేస్తోంది. ఇప్పుడున్న రోజుల్లో టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే. వారికి ఏమైనా అనుమానాలు ఉంటే సమీక్ష అడగొచ్చు. తప్పైతే నిర్ణయం రివర్స్ అవుతుంది. కానీ, అలా చేయకుండా నిందలు వేయడం సరైంది కాదన్నారు. మహమ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని మదన్ లాల్ స్పష్టం చేశారు. ఈ వివాదం, ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడం వల్ల మొదలైంది. ఈ సంఘటనపై యూసఫ్, సూర్యకుమార్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
