M.S.Raju: నమ్మిన బంటుగా తనను గుండెల్లో దాచుకుని జీవితాన్ని త్యాగం చేసే గొప్ప గుణంతో పాటు, శత్రుమూకల గుండెల్లో నిద్రపోయిన డేర్ అండ్ డాష్ ఉన్న వ్యక్తి, తనపై నోటికి వచ్చినట్లు కారు కూతలు కూసిన వారికి ఘాటైన బదులిచ్చిన గడసైనోడు ఆ ప్రాంతాన్ని సరి చేయగల ఆ సత్తా ఈ ఒక్కడికి మాత్రమే ఉందని నమ్మి ఆ నియోజకవర్గానికి 2024 ఎన్నికల చివరి క్షణాల్లో అతనిని పంపించారు టీడీపీ అధినేత చంద్రబాబు… ఎన్నికలకు పట్టుమని పది రోజులు కూడా సమయం లేదు. కొత్త ప్రాంతం… అధిష్టానం ఆదేశించింది. ఆయన రంగంలోకి దిగారు…. నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు చెప్పవచ్చు పార్టీకి విధేయుడు… ఆయనే గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఇద్దరు నాయకులు కలయికతో పది రోజుల్లోనే టీడీపీ జెండా సగర్వంగా ఎగిరేశారు.
టీడీపీ అధిష్టానం మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుని ప్రకటించిన తర్వాత క్యాడర్‌లోను అయోమయం ఏర్పడింది. ఇక అప్పుడు అధికార పార్టీ నాయకుల్లో గెలుపు తమదే అనే విధంగా ధీమాతో ముందుకు వెళ్లారు. కట్ చేస్తే టీడీపీ విజయానికి క్యాడర్ చాలానే కష్టపడ్డారని చెప్పవచ్చు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ అనూహ్యంగా పొంది మడకశిర ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు తీసుకొన్న నిర్ణయం సరైనదేనని ఎమ్మెస్ రాజు నిరూపించారు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు హామీలు ఇస్తుంటారు.. పోతుంటారు చేసేదేమీ లేదు. కానీ రాజన్న మాట ఇచ్చారంటే చేస్తారంతే అనే విధంగా మడకశిరను అన్ని విధాల అభివృద్ధి పరుస్తూ ప్రజల గుండెల్లో నాటుకుపోతున్నారు. సీఎం చంద్రబాబు మాటకు గౌరవం ఇచ్చి మడకశిరకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలల్లో ఇంత వరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సూచనలతో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు
M.S.Raju: మడకశిర కోసం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కృమరాపురం దాక కృష్ణా జలాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హంద్రీనీవా కాలువల ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెస్ రాజుకు అధికారులు హంద్రీనీవా కాలువ స్థితిగతులు మ్యాప్ ద్వారా వివరించారు.
అనంతరం హంద్రీనీవా కాలువలను, పంప్ హౌస్‌లను పరిశీలించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు ప్రకారం సీఎం చంద్రబాబు మడకశిరలోని అన్ని చెరువులను నింపడానికి సిద్ధంగా ఉన్నారు. హంద్రీనీవా జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజా స్వరూప్ మడకశిర నియోజకవర్గంలోని చివరన అమరాపురం దాకా కృష్ణా జలాలను హంద్రీనీవా కాలువల ద్వారా తీసుకురావడంతో పాటు మడకశిరలోని 208 చెరువులను నింపడానికి నిరంతరం అధికారులు కాలువల మీద పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా కాలువలను బాగుపరిచి నీళ్లు అందిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Ladakh: లడఖ్ లో స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాలు.. కేంద్రం అంగీకారం
M.S.Raju: మడకశిర ప్రజలకు కల నెరవేరుతున్నాయంట ఒక్కొక్కటి. కనీసం మౌలిక వసతులు నోచుకోక ఎన్నో గ్రామాలు ఉన్నాయి… ఎమ్మెల్యేగా ఎమ్మెస్ రాజు గెలిచిన తర్వాత తాగునీరు, కరెంటు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కారంతో పాటు యూత్‌కి ఉద్యోగ అవకాశాలు కోసం పరిశ్రమలు తీసుకొస్తున్నారు. రైతన్నల కోసం హంద్రీనీవా జలాలను చెరువులును నింపే ప్రయత్నం… ఇలా మడకశిర రూపురేఖల్ని మారుస్తున్న ఒకే ఒక నాయకుడు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అంటున్నారు స్థానిక ప్రజలు….
ఆరు నెలల్లోనే మారుమూలన కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాన్ని సగరు ఉందా ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాల్లో నెంబర్ వన్ మడకశిర ఉండే విధంగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని స్థానిక ప్రజలు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారంట… మరి చూడాలి ఎమ్మెల్యే మరో నాలుగున్నర సంవత్సరం కాల పరిధిలో నా బూతు నా భవిష్యత్తు అనే విధంగా మడకశిర అభివృద్ధిలో దూసుకెళ్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.