Lucky Bhaskar Sequel: దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందని దర్శకుడు వెంకీ అట్లూరి ధృవీకరించారు. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో కొత్త అంశాలు చేరుస్తారట. దుల్కర్ మళ్లీ లక్కీ భాస్కర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Jana Nayagan: యూకేలో ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్‌టైమ్ రికార్డు
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ చిత్రం గతేడాది విడుదలై భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 111 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా దుల్కర్ కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. 1990ల నాటి ముంబై నేపథ్యంలో సాగే ఈ ఫైనాన్షియల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుందని దర్శకుడు వెంకీ అట్లూరి ధృవీకరించారు. మొదటి భాగం కథను కొనసాగిస్తూ కొత్త కోణాలు చేర్చి మరింత గ్రాండ్‌గా తీసే ప్రణాళికలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సీక్వెల్‌లో దుల్కర్ సల్మాన్ మళ్లీ టైటిల్ రోల్‌లో కనిపించనున్నాడు. మొదటి భాగంలో భాస్కర్ కుటుంబం అమెరికాకు తరలివెళ్లిన సన్నివేశంతో ముగిసిన కథను, ఇక్కడి నుంచి కొనసాగించే అవకాశం ఉంది. తెలుగు, మలయాళం ప్రేక్షకులతోపాటు ఇతర భాషల్లోనూ ఆదరణ పొందేలా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్, ఇతర వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

