Lucky Baskhar Trailer: ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ వచ్చేసింది..

మలయాళ యంగ్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం సాయంత్రం మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. నిర్మాత నాగ వంశీ, హీరో దుల్కర్, హీరోయిన్ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

డబ్బే అన్నింటికంటే విలువైందనే కాన్సెప్టుతో ఈ సినిమాని రూపొందించినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. నెలకు రూ. 6 వేల జీతం తీసుకునే సాధారణ ఉద్యోగి అయిన భాస్కర్‌ కుమార్‌.. కోటీశ్వరుడిగా ఎలా మారాడు?. ఆ తర్వాత అతడి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *