Lucky Baskhar OTT: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అదిరిపోయే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా బాగా సక్సెస్ అయ్యింది. ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ఓ రేంజిలో రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో 13 వారాలుగా వరుసగా ట్రెండింగ్‌లో కొనసాగుతుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఇలా వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అవుతున్న తొలి సౌత్ ఇండియన్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ అని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రొడ్యూస్ చేశారు.
