Viral News

Viral News: లా చదువుతున్న.. లా మీద నమ్మకం లేదు.. 26 సార్లు చెంపదెబ్బలు కొట్టిన యువతీ..

Viral News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అమిటీ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న షాకింగ్ ఘటన అందరినీ కలవరపెడుతోంది. విశ్వవిద్యాలయ క్యాంపస్ పార్కింగ్ స్థలంలో ఓ విద్యార్థిని తన క్లాస్‌మేట్‌పై దాడి చేసింది. కారులో కూర్చోబెట్టి ఒక నిమిషం వ్యవధిలోనే 26 సార్లు చెంపదెబ్బలు కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఘటన వివరాలు

ఫిర్యాదు దారుడు ముఖేష్ కుమార్ కేసర్వానీ తెలిపిన వివరాల ప్రకారం, అతని కుమారుడు శిఖర్ అమిటీ విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరం బీఎ ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన సంఘటన కారణంగా శిఖర్ కొంతకాలంగా  కాలేజీకి వెళ్లడం మానేశాడు. ఆగస్టు 26న శిఖర్ చాలా రోజుల తర్వాత కాలేజీకి వెళ్లాడు.

ఇది కూడా చదవండి: Crime News: మైనర్‌‌తో 35 ఏళ్ల వ్యక్తి.. చివరికి లాడ్జిలో

పార్కింగ్ ఏరియాలో జాన్వి మిశ్రా తన స్నేహితులు ఆయుష్ యాదవ్, మిలన్ బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమాన్ శుక్లాతో కలిసి వచ్చి శిఖర్‌ను కారు లోపలికి బలవంతంగా కూర్చోబెట్టింది. ఆ తర్వాత అతనిపై దుర్భాషలాడుతూ వరుసగా 26సార్లు చెంపదెబ్బలు కొట్టారు. దెబ్బలు కోటేటపుడు మొఖం మీద చేయి పెట్టకూడదు అంటూ ఇంకా  బలంగా  కొట్ట సాగారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది.

ఫిర్యాదు, దర్యాప్తు ప్రారంభం

ఈ ఘటనతో శిఖర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. శిఖర్ తండ్రి ఫిర్యాదు మేరకు చిన్హాట్ పోలీస్ స్టేషన్లో జాన్వి మిశ్రా మరియు ఆమె ఐదుగురు స్నేహితులపై కేసు నమోదు చేశారు. “విద్యార్థిని ఎందుకు కొట్టారన్న కారణంపై ఇంకా స్పష్టత లేదు. దర్యాప్తు ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఇన్‌స్పెక్టర్ దినేష్ చంద్ర మిశ్రా తెలిపారు.

యూనివర్సిటీ స్పందన

ఈ ఘటనపై అమిటీ యూనివర్సిటీ పీఆర్ఓ చంద్రశేఖర్ వర్మ స్పందిస్తూ, “సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో ప్రామాణికతను మేము నిర్ధారించలేము. అధికారిక ఫిర్యాదు అందితే విశ్వవిద్యాలయ పరంగా దర్యాప్తు జరిపి, నిందితులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.

ALSO READ  Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *